Samantha-Naga Chaitanya: ఒకటి కాబోతున్న సమంత… నాగచైతన్య అదే కారణమా?

Samantha-Naga Chaitanya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎంత తొందరగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారో అంతే తొందరగా విడాకులు తీసుకొని విడిపోతూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఉన్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న నాగచైతన్య సమంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విధంగా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు.

ఈ విధంగా వీరిద్దరూ విడాకులతో విడిపోవడం వల్ల సమంత నాగచైతన్య గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే ఇలాంటి వార్తలు అన్నింటిని ఇద్దరు పూర్తిగా వదిలేసి తమ కెరియర్ పై పూర్తి దృష్టి పెట్టారు. అయితే సమంత నాగచైతన్య ఇదివరకే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పటికీ వీరు ఒకరిపై మరొకరు చేసుకున్నటువంటి కామెంట్స్ విన్న తర్వాత వీరిద్దరూ తిరిగి కలుసుకోవడం చాలా కష్టమని భావించారు.

ఇక తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తుంటే తిరిగి వీరిద్దరూ ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ నువ్వు ఎప్పుడు ఒంటరిగా నడవలేవు అనే అర్థంతో వచ్చే పోస్టులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నాగచైతన్య సమంత తిరిగి కలవబోతున్నారా అందుకే ఈమె ఇలాంటి పోస్ట్ పెట్టారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదివరకే కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ ఐశ్వర్య జంట కూడా విడాకులు ప్రకటించిన అనంతరం తిరిగి కలవబోతున్నామంటూ ప్రకటించారు. ఇలాగే సమంత నాగచైతన్య కూడా కలవాలని భావించారేమో అందుకే సమంత ఇలాంటి పోస్ట్ చేశారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య కలిసి ఉన్నటువంటి ఫోటోలను అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -