Joseph Prabhu: వామ్మో.. మాజీ అల్లుడిపై అలాంటి కామెంట్స్ చేసిన సమంత తండ్రి!

Joseph Prabhu: టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత, నాగచైతన్యల జంట గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ జంటను చూసి టాలీవుడ్ సెలబ్రేటీలు జలసీగా ఫీల్ అయ్యారని చెప్పవచ్చు. ఈ జంట ఇండస్ట్రీలో ఎంతో హడావిడి చేసేవారు. కానీ కొంతకాలానికి ఏమైందో కానీ.. వీరి వివాహ దాంపత్యనికి పూర్తిగా పులిస్టాప్ పెట్టేసారు.

ఈ విషయాన్ని ఇరువురు దంపతులు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న తమ అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. సెలబ్రేటీల నుంచి నార్మల్ పీపుల్స్ వరకు వీళ్లిద్దరు విడిపోవడం అసలు తీసుకోలేకపోయారు. దాదాపు కొంతకాలం వరకు వీరిద్దరి విడాకులు టాపిక్ సోషల్ మీడియాలో హడావిడి చేసేది. ఇక విడాయకులైన అనంతరం సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటూ.. పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రస్తుతం కెరీర్ పరంగా ఓ వెలుగు వెలుగుతుంది. ఇదిలా ఉంటే సమంత తండ్రి నాగచైతన్య పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు విడాకుల గురించి స్పందిస్తూ.. సమంత, నాగచైతన్యలు విడిపోయినప్పటి నుంచి.. నా మైండ్ బ్లాక్ అయినట్లుగా అనిపిస్తుంది అన్నట్లు తెలియజేశాడు. చైతన్య అంటే నాకు ఎంతో ఇష్టం.. చైతన్యతో గడిపిన సమయాన్ని నా కుటుంబం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని తెలిపాడు.

అంతేకాకుండా జోసెఫ్ ప్రభు ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో సమంత నాగచైతన్య పెళ్లి ఫోటోలు పోస్ట్ చేశారు. ఇక సమంత నాగచైతన్యలు విడిపోయినప్పటికీ.. వారి జీవితాల్లో మాత్రం ఇద్దరూ మరింత ముందుకు సాగాలని తెలిపినట్లు ఫేస్బుక్ రాసుకోవచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసి నాగచైతన్య ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. మీరు కూడా ఆ వైరల్ అవుతున్న ఫోటోలు చూసేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -