Samantha: స్టార్ హీరోయిన్ సమంత బాధ మామూలుగా లేదుగా?

Samantha:  తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత కొత్త సినిమా ‘యశోద’ విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో మరోసారి సమంత తన నటనతో ట్రాక్ లోకి వచ్చేసిందంటూ అందరూ ఆమెను అభినందిస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొద్దిరోజులు ఎవరికీ కనిపించకుండా ఉన్న సమంత.. యశోద కోసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం తెలిసిందే. అందులో తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని స్పష్టం చేయడంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు.

ఇక సమంత చేసిన కొత్త సినిమా ‘యశోద’ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లడానికి సిద్ధమైంది. ఈ తరుణంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సమంత, అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే సమంత, అక్కినేని నాగచైతన్యతో విడిపోయేటప్పుడు చాలా బాధపడిందనే విషయం తెలిసిందే. ఇద్దరూ విడిపోయాక కూడా సమంత.. దాని గురించే ఆలోచించి మదనపడిందని తెలిసింది.

‘యశోద’ సినిమా షూటింగ్ సమయంలో ఆమె గర్భవతిగా కనిపించే సందర్భంలో.. సమంత ఫీల్ అయిందట. తాను రియల్ లైఫ్ లో పిల్లలను కని ఎంతో ఆనందంగా ఉండాలని సమంత అనుకుందట. కానీ అంతకుముందే నాగచైతన్యతో సమంత విడిపోయిన నేపథ్యంలో ఆమె అది గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుందట. యశోద సినిమా టైంలోనే సమంత విడాకులు తీసుకోగా.. నిర్మాతలు నష్టపోకూడదని రెండు వారాలు షూటింగ్ కు వచ్చిందట.

ఆ సినిమా షూటింగ్ టైంలో తనను తాను అద్దంలో చూసుకొని ఎమోషనల్ అయిందట. పిల్లల్ని కనాలనుకున్న తాను చైతుతో విడిపోవడంతో బాధపడి.. చైతూకు విడాకులు ఇచ్చి తప్పు చేశానా అంటూ ఈ భామ బాధపడిందట. కానీ తర్వాత తనకు తాను సర్దిచెప్పుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొన్నదంట. తాజాగా యశోద సినిమా విడుదలైన నేపథ్యంలో గతంలో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతుండగా.. సమంత పరిస్థితి బాగోలేనందు వల్ల అక్కినేని నాగచైతన్య ఆమెను దగ్గరకు తీసుకోవాలని కొంతమంది కోరుకుంటూ ఉండటం విశేషం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ కు ఆ ఎన్నికలంటే భయమా.. ఏం జరిగిందంటే?

CM Jagan: ఏపీలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికలను నిర్వహించడానికి జగన్ సర్కారు వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఎన్నికల గురించి...
- Advertisement -
- Advertisement -