Samantha-Naga Chaitanya: మళ్లీ కలవబోతున్న చైసామ్.. రీజన్ ఏంటంటే?

Samantha-Naga Chaitanya: సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. అయితే, ఎందుకు ఏమిటనే విషయాలపై మాత్రం విభిన్న కథనాలు కథనాలు ప్రచారం అవుతున్నాయి. సమంత వ్యవహారంలో ఈ మధ్య అనేక వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ వార్తకు కాస్త ప్రాధాన్యం ఏర్పడింది. అందుకు కారణం.. విడాకుల తర్వాత సమంత జీవితంలో వచ్చిన మార్పులే. ఒక్కసారిగా ఆమె జీవితం కష్టాలపాలైంది. విడాకుల తర్వాత కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లడం.. తర్వాత మయోసైటిస్‌ జబ్బుతో బాధపడుతున్నానని తెలుపడంతో సమంతపై అందరూ జాలి చూపిస్తున్నారు.

 

సుమకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక అంశాలు వెల్లడించింది సామ్‌. సమంత, నాగచైతన్యలు మళ్లీ కలిస్తే బాగుండని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సమంత, చైతన్యలలో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా, ఎక్కడ కనిపించినా ఏదో ఒక రకంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కెరీర్‌ పరంగా ఎవరి బిజీలో వారు ఉంటున్నారు.

 

సమంత జబ్బు నుంచి కోలుకుంటున్నానని తెలిపిన నేపథ్యంలో ఇటీవల శాకుంతలం ట్రైలర్‌ రిలీజ్‌కు హాజరైంది. ఈ క్రమంలో ఆమె బాగా నీరసించిపోయి కనిపించింది. ఈ ఫంక్షన్‌లో కాస్త ఎమోషనల్‌కూడా అయ్యింది సమంత. దీంతో అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఎలా ఉన్న సామ్‌ ఎలా అయిపోయిందంటూ దిగులు పడుతున్నారు.

 

తాజాగా సమంత వీడియో, ఫొటోలు నాగచైతన్య చూశాడని తెలుస్తోంది. ఈ క్రమంలో సమంత ఆరోగ్యంపై నాగచైతన్య ఒకింత ఫీల్‌ అయ్యాడని టాక్‌. మాజీ భర్తగా కాకుండా ఓ ఫ్రెండ్‌గా ఆమెను కలవాలని నిర్ణయించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. సమంతకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకొనేలా చేయాలని నాగచైతన్య ప్రయత్నించబోతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయమే ఇప్పుడు అక్కినేని కాంపౌండ్‌లో వినిపిస్తోంది. ఇది నిజం కావాలని అటు నాగచైతన్య అభిమానులు, ఇటు సమంత ఫ్యాన్స్‌ కూడా కోరుకుంటున్నారు. ఎంతైనా మాజీ భర్త అని.. కొంచమైనా ప్రేమ ఉండకపోదా.. అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -