Samantha: వామ్మో.. ఇక సమంత ఆ పాత్రలో నటించదా?

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత గురించి తన అందం గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తన అందంతో ఎంతోమంది అభిమానులు ఆకట్టుకుంది ఈ అమ్మడు.

ఇక చైతుతో విడాకులైన తనంతరం.. ఏమాత్రం దిగులు చెందకుండా.. పూర్తిగా తన కెరీర్ పైన పోకస్ పెట్టింది. తన తల్లి ప్రోత్సాహంతో మళ్ళీ సినిమాల్లోకి అడుగుపెట్టి వరుస సినిమాలకు సైన్ చేస్తుంది. నిజానికి చెప్పాలంటే సమంతకు పుష్ప సినిమా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సినిమా తర్వాత సమంత ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయింది. అంతేకాకుండా హాలీవుడ్ లో కూడా పలు ఆఫర్లు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. సమంత శకుంతల, యశోద సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఏదేమైనా విడాకులైన తరవాత సమంత కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైంది.

ఇదిలా ఉంటే తాజాగా సమంత ఒక సంచలన మైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేమిటంటే.. సమంత ఇప్పటినుంచి చేసే సినిమాల లో గ్లామర్ రోల్స్ అండ్ లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉండాలని సమంత ఫిక్సయిందట. అంతే కాకుండా ఈ కండిషన్స్ అన్నిటిని ఒప్పుకుంటేనే సమంత సైన్ చెయ్యడానికి ఒప్పుకుంటుంది అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సమంత యశోద, శకుంతలం సినిమాలు త్వరలో థియేటర్లోకి రాబోతున్నాయి. మరి సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చే ఖుషి సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -