Samantha: సమంత పరువు పాయే.. అల్లు అర్హ అద్భుతంగా యాక్ట్ చేసిందిగా!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించగా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చిన్నప్పటి భరతుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఏప్రిల్ 14వ తేదీ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించిన స్థాయిలో ప్రేక్షకాధరణ దక్కడం లేదు.

చాలా వరకు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ కి ఎక్కువగా వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే శాకుంతలం సినిమాలో హీరోయిన్ సమంత కంటే అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ క్రెడిట్ మొత్తం కొట్టేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్హ ఈ సినిమాలో చిన్ననాటి భరతుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అందులో చాలా అద్భుతంగా నటించిందని లుక్ పరంగా కూడా చాలా బాగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఆమె అపీరియన్స్ హైలెట్ అనేలా వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే దేవ్ మోహన్‌ తో అర్హ చెప్పే డైలాగ్స్, సింహంపై అర్హ వచ్చే సన్నివేశంలో ఎక్కడా తడబడకుండా అల్లు అర్హ నటించిందని సినిమా చూసిన వారంతా ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సమంత చెప్పినట్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని అల్లు అర్హ ఏలేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసిన కొందరైతే అర్హ నటించిన సన్నివేశాలని సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్హ తన తల్లి స్నేహతో కలిసి షూటింగ్ కి వెళ్తున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -