Samantha: సమంత వ్యాధి థర్డ్ స్టేజ్ లో ఉందా.. ప్రాణాలకే ప్రమాదమా?

Samantha: టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత ఇటీవల అరుదైన జబ్బుతో బాధపడుతున్నానని తెలిపిన విషయం తెలిసిందే. తాను మయోసైటిస్‌ అనే జబ్బు బారిన పడ్డానని సోసల్‌ మీడియా వేదికగా చెప్పింది సమంత. దీంతో సమంత ఫ్యాన్స్‌ అందరూ షాక్‌కు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. పలువురు సెలబ్రిటీలు సైతం సమంత జబ్బుపై స్పందించారు. త్వరగా రికవరీ కావాలంటూ సోషల్‌ మీడియా ద్వారా ట్వీట్లు చేశారు.

 

త్వరలోనే కోలుకుంటాననే నమ్మకం ఉందంటూ సమంత పేర్కొంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, ఆరోగ్యం నిలకడగా ఉందని సమంత తెలిపింది. కొందరు వైద్యులు చెబుతున్న సమాచారం మేరకు సమంతకు సోకిన ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆటో ఇమ్యూనిటీ డిజాస్టర్ అని తెలుస్తోంది. మయోసైటిస్‌ వ్యాధిలో పలు రకాలున్నట్లు తెలుస్తోంది.

 

పాలిమయోసైటిస్‌, డెర్మటో మయోసైటిస్‌, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్‌ ఇలా పలు రకాలుగా ఈ వ్యాధి సోకుతుందని సమాచారం. దీని లక్షణాలు తీవ్రంగా ఉంటాయట. అయితే, సమంతకు సోకిన అరుదైన వ్యాధి గురించి ప్రముఖ నటి కీలక వ్యాఖ్యలు చేసింది. తాను కూడా అలాంటి వ్యాధితోనే బాధపడుతున్నట్లు చెప్పి షాక్‌ ఇచ్చింది. యశోద మూవీలో నటించిన నటి కల్పిక గణేష్ సమంత ఆరోగ్యంపై చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

తనది ఫస్ట్ స్టేజ్ అని, సమంతది మూడో స్టేజ్ అని నటి కల్పిక చెప్పారు. ఈ సమస్య గురించి సమంతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కల్పిక వెల్లడించింది. కల్పిక తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తోంది. ఇక కల్పిక సినీ ఇండస్ట్రీలో మూవీల సంగతి చూస్తే.. పలు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్‌ రోల్స్‌లో నటించి మెప్పించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -