Samantha: ఎన్టీఆర్-సమంత కాంబినేషన్ లో మరో సినిమా మిస్

 Samantha: టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఈ కాంబినేషన్ కు ఎంతో పేరుంది. గతంలో వీరి కాంబినేషన్ లో రామయ్యా వస్తామవయ్యా, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్, సమంత మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, కామెడీలు చేసుకోవడం లాంటి చేస్తూ ఉంటారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే.. టాలీవుడ్ లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి.

అయితే మరోసారి వీరి కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ వీరి కాంబినేషన్ సెట్ అయినా.. చివరి నిమిషంలో మిస్ అయింది. రెమ్యూనరేషన్ కారణంగా వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఇది రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని కొరటాల శివ భావించారు. కానీ సమంత ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ ను చిత్ర నిర్మాతలు ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. కానీ రూ.4 కోట్లను సమంత డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రూ.4 కోట్లు ఇస్తేనే సినిమాలో నటిస్తానని చెప్పినట్లు ఫిల్మ్ స్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. కానీ రెమ్యూనరేషన్ మరీ ఎక్కువ కావడంతో చిత్ర నిర్మాతలు ఇవ్వలేమని చెప్పినట్లు టాక్. అందువల్ల ఎన్టీఆర్ సినిమాలో నటించాల్సిన సమంత చివరి నిమిషంలో మిస్ అయింది. ఎన్టీఆర్-సమంత కాంబినేషన్ ను చూడాల్సిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై సమంత ఫోకస్ పెట్టింది. ముంబైలోనే మకాం వేసి బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ వైపు సమంత చూడటం లేదు. బాలీవుడ్ లో పాతుకుకపోవాలని చూస్తంది. బాలీవుడ్ లో సమంత ఫీచర్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -