Samantha Ruth Prabhu: సమంత జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారా.. ఆ పోస్ట్ అర్థం ఇదేనా?

Samantha Ruth Prabhu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. కేవలం ఈమె సోషల్ మీడియా వేదికగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సరికొత్త ఊహగానాలకు దారి తీస్తోంది.

నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత ఈమె రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలు పై సమంత ఏమాత్రం స్పందించలేదు అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ మాత్రం అందరిలో ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేశారు దాని అర్థం ఏంటి అనే విషయానికి వస్తే…

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ ఈ విషయం వినాలనుకుంటే మనం ఎప్పటికీ నడవం అనే ఒక క్యాప్షన్ తో ఫోటోని షేర్ చేశారు. అదేవిధంగా ఒక టీ షర్ట్ పై యు విల్ నెవ‌ర్ వాక్ అలోన్ అనే రాసి ఉంది. త‌న ముఖం కూడా సరిగా కనిపించకుండా ఉంది. ఇలా ఒంటరిగా జీవితంలో ముందుకు నడవలేము అంటూ ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ వెనుక అర్థం ఏంటి అంటే సమంత తన జీవితంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

సమంత తన జీవితంలో మరొకరితో కలిసి ముందుకు నడవాలని భావిస్తున్నారా అందుకే తన నిర్ణయాన్ని ఇలా తెలియజేశారా అనే ఊహగానాలు మొదలయ్యాయి. మరి సమంత చేసిన ఈ పోస్ట్ వెనుక ఉన్న అర్థం ఏమిటి అనే విషయం తెలియాలంటే సమంత నుంచి సమాధానం వచ్చే వరకు వేచి చూడాలి. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఈమె యశోద ఖుషి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె నటించిన శాకుంతలం సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -