Samantha: రాత్రంతా ఆ పనిలోనే ఉన్నానంటున్న సమంత!

Samantha: టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత అటు పర్సనల్ లైఫ్ లోను ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోను ఒడిదుడుకులని ఎదుర్కొంటుంది. పర్సనల్ లైఫ్ లో చైతన్యతో విడిపోయిన తర్వాత ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలని ఎదుర్కొంది సమంత. దానిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసింది.

అయితే అది తీవ్ర నిరాశని మిగిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే జయపజయాలని పెద్దగా పట్టించుకోని సమంత ఇప్పుడు ఒకవైపు బాలీవుడ్లో సిటాడిల్ వెబ్ సిరీస్ లో నటిస్తూనే మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటూ పూర్తిగా బిజీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

 

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండేది. కానీ సమంత మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడటంతో షూటింగ్ లో పాల్గొనలేకపోయింది. ఇప్పుడు కాస్త కోలుకున్న ఈ భామ ఖుషి షూటింగ్ లో పాల్గొంటూ షూటింగ్ అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తుంది. తాజాగా సమంత పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

 

ఖుషి మూవీ షూటింగ్లో రాత్రంతా షూటింగ్ పూర్తిచేసుకుని పగలంతా పార్టీలో ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది సమంత. అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా షేర్ చేసింది ఈ భామ. ఈ ఫోటోలో నాటీ లుక్స్ తో కనిపించి కుర్ర కారు మనసు దోచుకుంది సమంత. ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని మరొక షెడ్యూల్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాము.

 

ప్రజెంట్ గ్వాలియర్ నుంచి కేరళ కి వెళ్తున్నాము అంటూ ఒక నోట్ షేర్ చేసింది. ఈ సినిమా ప్రోమో చూస్తుంటే హిట్ అయ్యేటట్టుగానే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా హిట్ అవడం అటు విజయ్ దేవరకొండ కి ఎంత అవసరమో ఇటు సమంతకి కూడా అంతే అవసరం.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -