Samantha: తోడు లేకుండా నీవు బ్రతకలేవంటూ నాగ చైతన్యకు సమంత సెటైర్!

Samantha: సినీ రంగంలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. చాలాకాలం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న నాగ చైతన్య సమంత టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా అందరి ఆశీర్వాదాలు అందుకొని గత అక్టోబర్‌లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి సమంత , నాగ చైతన్య గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి తోడుగా సమంత సోషల్ మీడియాలో పెట్టే కొన్ని పోస్టులు కూడా చాలా ఆసక్తికరంగా మారి అందరినీ వారి గురించే మాట్లాడుకునేటట్టు చేస్తుంది

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని ఒక సంవత్సరం కావస్తుంది. 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా విడాకుల ప్రకటన చేశారు. వారు ఒకరినొకరు అర్థం చేసుకుని అధికారికంగా విడిపోతున్నట్లు వెల్లడించారు. నాగ చైతన్య, సమంత ఒకే తరహా విడాకుల నోట్ విడుదల చేశారు. అందులో కేవలం పేర్లు మాత్రమే మారాయి. విడాకులకు సోషల్ మీడియా పోస్ట్స్ మాత్రమే నిదర్శనం. సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ తరుణంలో ‘డౌన్ నాట్ అవుట్’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దాని అర్థం ఏమిటంటే… క్రింద పడ్డాను కానీ ఆట అయిపోలేదు. ఇక్కడ కింద పడ్డానంటే చైతూతో రిలేషన్, డైవర్స్ కావచ్చని అనుకుంటున్నారు.

సమంత ఈ ఇండైరెక్ట్ సెటైర్స్ వేయడం మానడం లేదు. తాజాగా ఆమె మరో పోస్ట్ చేశారు. సమంత తన టీ షర్ట్ పై ఉన్న కోట్ కనిపించేలా ఫోటో షేర్ చేశారు. ఆ కోట్ లో ‘యు విల్ నెవెర్ వాక్ అలోన్’ అని రాసుంది. అంటే నువ్వు ఒంటరిగా బ్రతకలేవు అని ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారని అర్థం కావడం లేదు. విడాకులు తీసుకున్న సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఒంటరిగానే ఉంటున్నారు. రెండో పెళ్లి చేసుకుంటారో లేదో క్లారిటీ లేదు. వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం కూడా లేదు. రెండో పెళ్లి చేసుకుంటారు అనే వార్త వినిపిస్తుంది తప్ప దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదు ఒక్క సమంత మాటలు తప్ప.

నాగ చైతన్యను ఉద్దేశించి సమంత నువ్వు ఒంటరిగా ఉండలేవని, రెండో పెళ్లి చేసుకుంటావని సెటైర్ వేస్తున్నారేమోననిపిస్తుంది. మరి అంత బాధ పెట్టేలా నాగ చైతన్య సమంతను ఏం ఇబ్బంది పెట్టాడో అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం అనే రెండు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. యశోద సైకలాజికల్ థ్రిల్లర్ కాగా, శాకుంతలం మైథలాజికల్ చిత్రం. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్లు, బాలీవుడ్ చిత్రాలతో పిచ్చ బిజీగా ఉంటూనే నాగచైతన్యను మరవలేక ఇలాంటి సెటైర్లు వేస్తున్నారు అని చాలామంది నాగచైతన్య ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -