Samantha: అల్లాడిపోయిన సమంత.. అంత గట్టిగా కొట్టారా?

Samantha: హీరో నాగచైతన్యతో విడిపోయిన తర్వాత హీరోయిన్ సమంత ఎంతో స్ట్రగుల్స్ అనుభవించింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ.. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని స్ట్రాంగ్‌గా నిలబడింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ అదే పంథాతో ముందుకెళ్లింది. సమంతకు రియల్‌ లైఫ్‌లోనైనా.. రీల్ లైఫ్‌లోనైనా ఛాలెంజింగ్‌గా ఉండటం ఎంతో ఇష్టమట. అందుకే చాలా వరకు ఫైటింగ్స్ ఉండే సినిమాల్లోనూ నటిస్తూ ఉంటారు. అలాగే సమంత తాజాగా నటించిన సినిమా ‘యశోద’లోనూ ఫైటింగ్ సీన్ అప్పుడు దవడలు పగిలించుకున్నట్లు చెప్పుకొచ్చింది. సమంత నటించిన లేటెస్ట్ చిత్రం ‘యశోద’. ఈ సినిమా ఈ నెల 11న థియేటర్ల ముందుకు రానుంది. అయితే సమంత ఆరోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. దీంతో తను ఎలాంటి ప్రయోషన్ ఈవెంట్స్ లో పాల్గొనలేదు.

 

తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూకి సుమ యాంకరింగ్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో సమంత తన అనారోగ్యంపై స్పందిస్తూ ఎమోషనల్‌గా మాట్లాడింది. గడ్డు కాలంలో కష్టాలు ఎదుర్కొన్నట్లు, అనారోగ్యంతో ఉన్నప్పుడు పైకి లేవడానికి కూడా ఇబ్బంది పడ్డట్లు, ఒక్క అడుగు కూడా వేయలేకపోయినట్లు సమంత బాధ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత మరో ఆసక్తికరమైన విషయాన్ని సమంత తెలిపింది. సమంతకు యాక్షన్ సీన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమట. డాన్స్ కంటే ఎక్కువగా యాక్షన్ సీన్స్ కు మాత్రమే ప్రిఫర్ చేస్తానని పేర్కొన్నారు. షూటింగ్‌లో భాగంగా ఫైట్ సీన్లు చేస్తున్నానంటే రెండు, మూడు రోజుల నుంచే ఎంతో ఆతురతగా ఎదురు చూస్తానని తెలిపారు.

 

యశోద సినిమాలోనూ ఫైటింగ్ సీన్లు ఎక్కువగా ఉంటాయని, సినిమా చివరల్లో వచ్చే ఫైటింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపింది. అయితే ఫైటింగ్ సీన్స్ చేయడానికి ఎంత ఇష్టమున్నప్పటికీ.. కొన్ని సార్లు దెబ్బలు కూడా తగిలేదని చెప్పింది. యశోదలో ఫైటింగ్ సీన్స్ చేసేటప్పుడు తనకు దెబ్బలు తగిలాయని, అప్పుడు దవడ కూడా పగిలిందని పేర్కొంది. ఒక్క పంచ్‌తో దవడ దద్దరిల్లిందన్నారు. అరగంటపాటు ఆ నొప్పిని భరించలేకపోయాయని తెలిపారు. దెబ్బకు ముఖం వాచిపోయిందన్నారు. ఎంత దెబ్బ తగిలినా.. ఫైటింగ్ సీన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తానని సమంత తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -