Actress Sana: సనా షాకింగ్ కామెంట్స్.. ఇంత కసి ఉందా అనిపించేలా?

Actress Sana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా ఎన్నో కీలక పాత్రలలో నటించిన ఎంతోమంది నటీనటులు కూడా మంచి గుర్తింపు పొందారు. ఇలా ఎన్నో ఏళ్లుగా కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి నటిగా గుర్తింపు పొందిన సీనియర్ నటి సనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో అక్క అత్త వదిన చెల్లి వంటి పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన ఇప్పటికీ కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సనా తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజాతో కలిసి బెడ్ షేర్ చేసుకునే సీన్ లో నటించటానికి గల కారణం కూడా వెల్లడించింది. ఓటీటీలో విడుదలైన మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో ఒక స్ట్రగుల్ ఉమెన్ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. ఐదు విభిన్న పాత్రలతో తీసిన ఈ వెబ్ సిరీస్ లో అలీ రెజాతో కలిసి సనా ఒక రొమాంటిక్ సీన్ లో నటించింది. ఆమె ఇలాంటి సన్నివేశంలో నటించడంతో అనేక విమర్శలు వినిపించాయి.

 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సనా కి ఈ సన్నివేశం గురించి ప్రశ్న ఎదురయింది. దీంతో సనా అలాంటి సన్నివేశంలో నటించడానికి గల కారణాలు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ క్రమంలో సనా మాట్లాడుతూ..” నేను ఆ పాత్రను ఒప్పుకోవడానికి కారణం డైరెక్టర్ కరుణకుమార్, రైటర్ ఖదీర్ బాబు. ‘మెట్రో కథలు’ అనే వెబ్ సిరీస్‌ లో నేను చేసిన స్టోరీలో.. మిడిల్ క్లాస్ ఉమెన్ ఎంత స్ట్రగుల్ అవుతుందని చూపించాం.వాస్తవంగా ప్రస్తుతం జరిగే సంఘటనలను చూపించారు.

 

ఆమె ఎంత స్ట్రగుల్ అవుతుందని.. సందేశాత్మకంగా చూపించారు. ఈ పాత్రను చాలా నీట్‌గా ప్రజెంట్ చేశారు. ఒక మంచి మెసేజ్ ఉంది.. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న పాత్ర కాబట్టి చేయాల్సి వచ్చింది. నా పాత్ర చూసి చాలామంది ఆడవాళ్లు.. ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న ఆడవాళ్లు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇది ఒక మెసేజ్.. నన్ను చూసి ప్రేరణ పొందుతారని ఆ పాత్ర చేశాను. ఇలాంటి అగ్లీ.. బ్యాడ్.. కాకుండా మంచి మెసేజ్ ఉన్న పాత్ర అయితే ఖచ్చితంగా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది నటి సన.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -