Madhurai: సహాయం చేస్తానని చెప్పి దారుణం.. చివరికి?

Madhurai: ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ అన్నది లేకుండా పోతోంది. ఆడవారు రోడ్డుపై కనిపించారు అంటే చాలు చిన్న పెద్ద అక్క చెల్లి వావి వరుస సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. సమాజంలో ఇంట్లో ఆఫీసులలో స్కూల్లలో ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా ఆడవారికి రక్షణ అన్నది లేకుండాపోతోంది. చాలామంది మృగాలు అమాయకమైన ఆడే వారిని లోబర్చుకొని వారి అవసరాలు తీరుస్తాము అంటూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు ఆ ఘటన బయటకు రాకుండా ఉండడం కోసం అత్యాచారం చేసి చంపేస్తున్నారు.

స్త్రీల అవసరాలను ఆసరాగా తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఒక యువతి చెన్నైలోని ఒక కాలేజ్‌లో చార్జట్‌ అకౌంటెన్సీ చదువుతోంది. గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఒక కాన్ఫరెన్స్‌లో పాల్గొనటానికి మధురై వెళ్లింది. ఆ సమయంలో ఆమె కొంత అనారోగ్యానికి గురైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన ఆశిష్‌ జైన్‌, కథిరవన్‌లు కూడా మధురై వచ్చారు. వారు అక్కడే ఒక లాడ్జిలో దిగారు. జైన్‌కు సదరు యువతికి ముందుగానే పరిచయం ఉంది.

 

తనకు అరోగ్యం బాగోలేని విషయం ఆమె జైన్‌కు చెప్పగా అనారోగ్యాన్ని అతడు అవకాశంగా తీసుకొని సహాయం చేస్తానని చెప్పి ఆమెను లాడ్జికి పిలిచాడు. ఆమె లాడ్జికి వెళ్లగానే జైన్ అతని స్నేహితుడు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. వెంటనే ఆ యువతి ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు గుజరాత్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో ఆ సంఘటపై ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును మధురై పోలీసులకు పంపారు. పోలీసులు నిందితుల కోసం గాలించి చివరికి ఏప్రిల్‌ 11న వారిని అదుపులోకి తీసుకున్నారు. .

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -