Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ సభలో భద్రతా వైఫల్యం.. ఏపీలో పరిస్థితులు ఇంత దారుణమా?

Narendra Modi: ఏమైనా చేయాలి.. కానీ, విపక్ష కూటమి దూకుడు తగ్గించాలని వైసీపీ నేతలు నిర్ణయించుకున్నట్టు ఉన్నారు. అందుకే.. ప్రజాగళం సభ అంటే వైసీపీ నేతల పార్టీ కాదు కదా అనేలా పోలీసులు వ్యవహరించారు. ప్రధాని మోడీ వచ్చిన సభలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. చిలకలూరిపేట సభలకు పల్నాడు ఎస్పీ శంకర్ రెడ్డి తన యంత్రాంగంతో సెక్యూరిటీ కల్పించారు. అయితే.. ఆయన తన విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ప్రధాని సభలో జరిగిన తొక్కిసలాటే పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. ప్రధాన వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోనే సీసా విసరడం, వేదిక ముందు తోపులాట జరిగినా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. మీడియా గ్యాలరీలోకి సాదారణ జనం వచ్చినా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు.

ప్రధాని హాజరైన సభకు పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్టేజ్ పై ఉండేవారు ఎంతమంది? వీవీఐపీ గ్యాలరీలో ఎంత మంది ఉంటారు? వీఐపీ గ్యాలరీలో ఎంతమంది ఉంటారు? మీడియా వారికి ప్రత్యేకంగా ఓ గ్యాలరీ.. తర్వాత సాధారణ ప్రజలు రావాడానికి పోవడానికి మార్గాలు… వచ్చేవారు, పోయేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ.. పోలీసు సభ నిర్వహనపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ప్రజలకు, వీఐపీలకు, వీవీఐపీలకు ప్రత్యేక మార్గాలు ఉన్నా.. అందరినీ వీఐపీ మార్గం దగ్గరకే పంపించేశారు. దీంతో.. అందరూ అందరూ ఒకే దగ్గర గుమిగూడి గందరగోళంగా మారింది. చాలా మంది వీఐపీలు కూడా సాదారణ జనం మధ్యలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా కొంతమంది అయితే సభా ప్రాంగాణంలోకి కూడా రాలేకపోయారు.

పోలీసుల వ్యవహారం చేస్తే కావాలనే ఇబ్బందులు పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే.. మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది సభా ప్రాంగాణంలోకి వెల్లడానికి పోలీసులతో వాగ్వాదం చేయాల్సి వచ్చింది. జనసేన, టీడీపీ నేతలను పాసులు ఉన్నా లోపలికి పంపించలేదు. గ్యాలరీ పాసులు ఉన్నాయి కానీ.. వాహనాల పాసులు లేవని అడ్డుకున్నారు. దీంతో.. కొంతమంది వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరికి చెందిన చాలా మంది సభ దగ్గరకు వెళ్లకుండానే వెనుదిరిగారు. వేలసంఖ్యలో సిబ్బంది ఉన్నప్పటికి కూడా పల్నాడు ఎస్పీ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు.

కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ పోలీసుల తీరు మారలేదు. ఇంతకు ముందు వైసీపీ నేతల ఆదేశాలకు పోలీసులు తల ఊపేవారు. కానీ, ఇప్పుడు అలా చేయడం సరికాదు. అధికారం మొత్తం ఈసీ చేతిలో ఉంటుంది. కానీ, అధికారాలన్ని వైసీపీ చేతిలోనే ఉన్నాయని పోలీసులు భ్రమపడుతున్నట్టు ఉన్నారు. అందుకే.. సభ నిర్వహనను పక్కన పెట్టి సభకు వస్తున్నవారిపై దృష్టి పెట్టారు. సభకు ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? వచ్చి నాయకులు ఏ జిల్లాకి చెందినవారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. సభకు వచ్చిన జనాన్ని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకు ఇలా అడుగుతున్నారని వారు తిరిగి ప్రశ్నిస్తే.. తాము పోలీసులమని పరోక్షంగా బెదరింపులకు దిగారు. ఇలా ఇంకా వైసీపీ నేతలకు వస్తాసు పలకడానేకే చేసిన ప్రయత్నంలో చిలకలూరిపేటలో భద్రతా వైఫల్యం బయటపడింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -