Mahesh Babu: కంటికి రెప్పలా మహేష్ బాబును కాపాడిన తల్లి.. అప్పుడు కూడా వేలు పట్టుకుని?

Mahesh Babu: టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మహేష్ నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం.

ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా మహేష్ సినిమా అవకాశాలు అందుకుంటూ ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా మహేష్ బాబు ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి కొన్ని గంటల క్రితం తన ఇంట్లో మరణించారు. ఈ విషయాన్ని సినీ ప్రముఖులు ఎవరు తీసుకోలేకపోతున్నారు. మహేష్ బాబు తల్లి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య ఇందిరా దేవి గారి మరణ వార్త ఎవరు తీసుకోలేకపోతున్నారు.

ఇంద్రాదేవి గారి మరణ వార్త తెలిసి సినీ రాజకీయ వర్గాలు కృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా దేవి గారు తన కొడుకు మహేష్ బాబు తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘట్టమనేని సాయి రాఘవ, ప్రియాంకకు హైదరాబాదులో నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థానికి చాలామంది సెలబ్రేటీలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ కుటుంబం సభ్యులు కూడా ఈ నిశ్చితార్థంలో పాల్గొన్నారు.

ఈ నిశ్చితార్థంలో ఘట్టమనేని ఫ్యామిలీ భారీ ఎత్తున హడావిడి చేసింది. కాగా ఈ నిశ్చితార్థం లో ఇందిరా దేవి గారు కొంచెం వృద్ధాప్యం కావడంతో తన కొడుకు మహేష్ బాబు చేయి పట్టుకుని నడుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మహేష్ బాబు ని తన తల్లి ముద్దుగా నాని అని పిలిచేదట. ఏదేమైనా మహేష్ బాబు తల్లి చనిపోవడంతో మహేష్ అభిమానులు ఒక రేంజ్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -