IAS officer Imtiaz joins YSRCP: వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి.. ప్రజల్లో గుర్తింపు లేని వాళ్లను చేర్చుకుని జగన్ ఏం సాధిస్తారో?

IAS officer Imtiaz joins YSRCP: జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలో గెలుపొందాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రజలలో ఏమాత్రం గుర్తింపు లేనటువంటి వారిని కూడా పార్టీలోకి చేర్చుకొని ఏకంగా వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్లను కూడా జారీ చేస్తున్నారు. ఇలా ముక్కు మొహం తెలియని అభ్యర్థులను ఎన్నికలకు పోటీగా నిలబెట్టడంతో పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పలు నియోజకవర్గాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి నాయకులను పక్కనపెట్టి ఏమాత్రం గుర్తింపు లేనటువంటి సాధారణ ప్రజలను అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. అయితే తాజాగా ఐఏఎస్ అధికారి కూడా తన పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరారు. ఈ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్‌ నేడు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఈయన పార్టీలోకి చేరారు.

ఇంతియాజ్‌ గతంలో సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నారు. ముఖ్యనేతలు, ఎమ్మెల్యే, జిల్లా నేతలతో ఆయన అభ్యర్థిత్వంపై జగన్ చర్చిస్తున్నారు. దాదాపు అభ్యర్థిగా ఇంతియాజ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం ఆయనకు తెలియడంతోనే తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

 

ఇంతియాజ్‌ తన పదవికి రాజీనామా చేసి నేడు పార్టీలోకి చేరారు ఇక త్వరలోనే కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఈయన పేరును ముఖ్యమంత్రి ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈయనకు ప్రజలలో పెద్దగా గుర్తింపు లేదు కానీ ఈయనకు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహారంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా గుర్తు తెలియని వారిని ఎన్నికలలో పోటీకి నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలలో గెలుపు పొందుతారన్న ధీమా ఎలా వ్యక్తం చేయగలుగుతున్నారన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -