Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

Revanth Reddy: ఈమధ్య కేటీఆర్ ప్రసంగిస్తూ తండ్రిని ఉద్దేశించి పులి బయటకి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. అయితే వాటికి సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటకు వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తామని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పలు కంపెనీలతో ఒప్పందాలకు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులు కాంగ్రెస్ అభిమానులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ చూద్దామన్నా కనిపించదు.

 

అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి లండన్ వేదికగా స్పందించారు. ఇంట్లో పడుకున్న పులి లేచి రాబోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు తాను కూడా దానికోసమే ఎదురుచూస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

తమ వద్ద బోను,వల ఉన్నాయని పులిని తమ కార్యకర్తలు చెట్టుకు వేలాడదీస్తారని ఎద్దేవా చేశారు. ఈనెల 26వ తేదీ తర్వాత తాను సుడిగాలి పర్యటనలు చేపట్టబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంద్రవెల్లిలో ప్రారంభించి రాష్ట్రం నలుమూలల పర్యటనలు చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్క ఎన్నిక విషయంలోనే బీఆర్ఎస్ నేతలు బొక్క బోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు.

 

అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం అహంకారం తగ్గలేదన్నారు వారి గర్వం అహంకారం తగ్గించే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ పార్టీని 100 మీటర్ల లోతున గొయ్యి తీసి పాతి పెడతానని చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత వారికి భయం పట్టుకొని ఇలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -