Jonnavithula: వైరల్ అవుతున్న జొన్నవిత్తుల సంచలన వ్యాఖ్యలు!

Jonnavithula: సినిమా ఇండస్ట్రీలో పాటల రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బ్రాహ్మణులు కోమట్లు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ బ్రాహ్మణులు సోమరులు కోమట్లు, స్మగ్లర్లు అని కంచే ఐలయ్య తన పుస్తకంలో రాశారని జొన్నవిత్తుల గుర్తు చేసుకున్నారు.

ఇక ఈ విషయం గురించి జొన్నవిత్తుల మాట్లాడుతూ ఇలా బ్రాహ్మణులను సోమరులని కోమట్లను స్మగ్లర్లు అనడం తాను ఏమాత్రం ఏకీభవించడం లేదని తెలిపారు. ఇది చాలా పెద్ద తప్పు ఈ భారతదేశాన్ని వైశ్యులు పరిపుష్టం చేశారని జొన్నవిత్తుల తెలియజేశారు.ఇక ప్రస్తుతం ప్రతి ఒక్క ఊరిలోను బ్యాంకులో ఉన్నాయి అయితే ఒకప్పుడు కోమట్లు వ్యాపారాలు చేసేవారు వీరు వ్యాపారం చేసే సమయంలో ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఈయన గుర్తు చేశారు.

ఇలా కోమట్లు పల్లెల్లో వ్యాపారాలు చేసే సమయంలో ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోలేదు అలాంటప్పుడు వారు స్మగ్లర్లు ఎలా అవుతారని ఈయన ప్రశ్నించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వారు వ్యాపారాలు చేసేవారు. వారికి ఏ వస్తువు ఎక్కడ ఉందో అన్ని స్పష్టంగా తెలిసేవి.వారు ఈ వ్యవస్థలు ఒక భాగం అయ్యారు అలాంటి వారి గురించి సోమరులు, స్మగ్లర్లు అంటూ తప్పుగా మాట్లాడటం భావ్యం కాదని జొన్నవిత్తుల తెలిపారు.

ఇలా ఈ వ్యవస్థలో ఒక భాగం అయినటువంటి బ్రాహ్మణులు సోమరులు, కోమట్లు స్మగ్లర్లు అంటూ తప్పుగా మాట్లాడటంతో తాను ఫైర్ అయ్యానని, వారిని సోమరులు స్మగ్లర్లు అనడం కరెక్ట్ కాదని ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధాలేనని తెలిపారు.ఏ విధమైనటువంటి కారణం లేకుండా విమర్శలు చేస్తే మాట్లాడకపోవడం ఎంతవరకు కరెక్ట్ కాదని జొన్నవిత్తుల ప్రశ్నించారు. ఆయన రాసారని దానిని ఖండించే హక్కు నాకు ఉందని తెలిపారు. బ్రాహ్మణుల గురించి చేసినటువంటి ఆరోపణలు నిజమని కనుక నిరూపిస్తే తాను లక్షల డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా జొన్ను విత్తల రామలింగేశ్వర రావు చాలెంజ్ విసిరారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -