CM YS Jagan: ఈ నెల 19పై వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ.. జగన్ ప్రకటనపై సస్పెన్స్

CM YS Jagan: ఏపీలోని పార్టీలన్నీ వచ్చే ఎన్నికలపై దూకుడు పెంచాయి. ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన ఎన్నికల కోసం ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ స్పీడ్ పెంచగా.. జనసేన కాస్త స్లోగానే ఉంది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఏపీలో బలం లేవు. దీంతో ఆ పార్టీలు ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. అధికార వైసీపీ అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పీకే టీంను మరోసారి నియమించుకున్న జగన్.. ఐప్యాక్ టీం ఇచ్చే నివేదికలు, సర్వేల ఆధారంగా మరోసార అధికారం కోసం ప్రయత్నాలు చేస్తోన్నారు.

ఇక ప్రతిపక్ష టీడీపీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో.. ఈ సారి జగన్ ను ఢీకొట్టి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటినుంచే ఎన్నికలపై దృష్టి పెట్టారు. బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టేందుకు అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు సంత్సరాలు సమయం ఉండగానే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టారంటే.. ఆయన వచ్చే ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. అంతేకాదు ఇటీవల కొంతమంది అభ్యర్థులను కూడా చంద్రబాబు ఫిక్స్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ టికెట్స్ కేటాయించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని, ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాడుతున్నారని, అందుకే టికెట్ ఫిక్స్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక చంద్రబాబు దూకుడు పెంచడంతో సీఎం జగన్ కూడా అభ్యర్థుల ఎన్నికపై ముందు నుంచే ఫోకస్ పెట్టారు. పీకే టీమ్ సర్వేల ద్వారా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇప్పటినుంచే పక్కన పెడుతున్నారు.

పార్టీ బలహీనంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను కొత్త ఇంచార్జ్ లను జగన్ నియమించే అవకాశముంది. గతంలో ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్.. గడపగడప కార్యక్రమంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ మళ్లీ దక్కాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ ప్రజల్లో తిరగాలని, ప్రజల్లో ఆదరణ పెంచుకోవాలని సూచించారు. ప్రజల్లో బలం లేని నేతలకు టికెట్లు కేటాయించేది లేదని తేల్చిచెప్పారు. అయితే ఈ నెల 19న వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ సమావేశంలో జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. చంద్రబాబు ఇప్పటికే కొంతమందికి టికెట్లు ఫిక్స్ చేయడంతో జగన్ నుంచి కూడా అలాంటి ప్రకటన ఏమైనా చేస్తారనే చర్చ వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొంతమందికి జగన్ టికెట్లు ప్రకటించవచ్చని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు.

ఎవరిపై పాజిటివ్ ఉందో.. ఎవరిపై ప్రజల్లో నెగిటివ్ ఉందో తెలుసుకున్నారు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టే విషయంపై నేతలకు క్లారిటీ ఇచ్చే అవకాశముంది. ఎవరికి టికెట్లు ఇస్తాననే అంశాన్ని జగన్ బయటపెట్టే అవకాశముంది. ఎమ్మెల్యేల పనితీరుపై గ్రేడ్ ల వారీగా జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 150 మంది ఎమ్మెల్యేల్లో ఎవరి పనితీరు ఎలా ఉందో చెప్పనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతి జిల్లాలో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా సమన్వయకర్తలను జగన్ ఆదేశించను్నారు.

అలాగే నియోజకవర్గ స్ధాయిలోనే సమావేశాలు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి పరిశీలకుడిని నియమించాలని జగన్ ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకకున్నారు. త్వరలోనే వారి పేర్లతో కూడిన లిస్ట్ ను వైసీపీ అధిష్టానం విడుదల చేయనుంది. పరిశీలకు ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లోని పరిస్ధితులపై అధిష్టానానికి నివేదికలు ఇస్తూ ఉంటారు. ఇక ఈ సమావేశం తర్వాత జగన్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడతారని తెలుస్తంది. ఇక నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలపై స్పీడ్ పెంచుతారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -