Roja – Sharmila: రోజాకు బుద్ధి చెప్పిన షర్మిల.. జబర్దస్త్ షో పేరు చెబుతూ?

Roja – Sharmila: మాటకు మాట.. దెబ్బకు దెబ్బ.. ఇదే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్టైల్. అవతలి వారు ఎంతటి వారైన అంతకు మించి అనేలా కౌంటర్ ఇవ్వాల్సిందే. సింహం కడుపును సింహమే పుడుతుందని ప్రచారం చేస్తున్న షర్మిల.. నిజానికి సింహలాగానే విపక్షాలపై.. ప్రధానంగా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి వారినే లెక్క చేయకుండా వడ్డీతో సహా చెల్లించేస్తుంది. అలాంటిది మిగిలిన వారి విషయంలో షర్మిల మౌనంగా ఉంటారనుకుంటే పోరపాటే. ఈ విషయం తెలిసో తెలియకో మంత్రి రోజా.. షర్మిలపై విమర్శలు చేశారు. తెలంగాణలో పార్టీని మూసేసి షర్మిల ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ బిడ్డ అని చెప్పకుంటున్న షర్మిల.. వైఎస్సార్ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారని విమర్శించారు. అంతేకాదు.. వైఎస్ కుటుంబాన్ని విచ్చిన్నం చేసి.. రాజశేఖర్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టిన కాంగ్రెస్ లో షర్మిల చేరడం దారణమని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రోజా ప్రతీమాటకు షర్మిల సమాధానం చెప్పారు. సమాధానం అంటే మామూలుగా కాదు. అంతకుమించి అనేలా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. గతంలో రోజాపై ఎవరూ చేయని విమర్శలు షర్మిల చేసి ఏపీ పాలిటిక్స్‌ను హీటెక్కించారు. నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా… నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ దోపిడీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ దోపిడి మంత్రితో ఆగిపోలేదని.. దోపిడీలో రోజా అన్నలు, భర్త కూడా మంత్రిని మించిపోయారని విమర్శించారు. ఇసుక, మట్టి, గ్రావెల్, స్థలాలు ఇలా దొరికిన దగ్గర దొరినట్టు దోచేశారని మండిపడ్డారు. ఈ మంత్రి కుటుంబం కన్ను పడని ప్రాంతం లేదని విమర్శించారు.

వైఎస్సార్‌ను పంచె విప్పి కొడతానని గతంలో రోజా చేసిన కామెంట్స్‌ను షర్మిల గుర్తు చేశారు. వైఎస్సార్ అభిమానులు ఎవరూ ఆమె క్షమించరని ధ్వజమెత్తారు. నోరుంది కాదా అని పారేసుకుంటే ఈ సారి మాటలతో సమాధనం ఉండదని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో తనను విమర్శించిన వారికి పుట్టగతులు లేకుండా చేశానని.. రోజా పరిస్థితి కూడా అలాగే ఉంటుందని హెచ్చరించారు. బాపట్లలో కూడా ఒకరు తనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ కుమార్తెను కనుక తాను తిరుగుతున్నానట.. లేకపోతే ఆ బాపట్ల వైసీపీ నేత ఏం చేసేవాడో అని షర్మిల ప్రశ్నించారు. తాను కాసేపు వైఎస్ కుమార్తెను అనే విషయాన్ని పక్కన పెట్టి ఎవరు వస్తారో రావాలని సవాల్ చేశారు. ఎంతమంది వస్తారో రండి.. తేల్చుకుందామని నిప్పులు చెరిగారు.

 

వైసీపీ కోసం 3 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేస్తే అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పడేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కగా ఉన్న వైసీపీకి తన పాదయాత్ర ద్వారా ఎరువు వేసి మహావృక్షాన్ని చేశానని అన్నారు. ఆడబిడ్డని అని చూడకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ద్వజమెత్తారు. తెలంగాణలో పార్టీ మూసేయలేదని.. కాంగ్రెస్ లో విలీనం చేశానని అన్నారు. కాంగ్రెస్ ఉన్నంత వరకూ తన పార్టీ ఉంటుందని షర్మిల చెప్పారు. గొప్ప ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరారనని.. ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొని వస్తానని షర్మిల శపథం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -