YCP: షర్మిల టార్గెట్ ను చేసి అలాంటి కామెంట్స్ చేస్తున్న వైసీపీ.. ఏం జరిగిందంటే?

YCP: జగన్ ప్రభుత్వ పాలనను ఎదిరించిన వాళ్ళకి ఎలాంటి గతి పట్టిస్తారో అందరికీ తెలిసినదే. వేధించటం, కేసులు పెట్టడం, ఇవేవీ కాకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్లి నీచమైన వ్యాఖ్యలతో వ్యక్తిత్వ దూషణ కి పాల్పడతారు. ఇది ప్రస్తుతం జగనన్న రాజ్యంలో జరుగుతున్న దారుణం. అయితే సాధారణ ప్రజలకే కాదు ఇప్పుడు సొంత చెల్లెలికి కూడా ఇదే ట్రీట్మెంట్ ఇస్తున్నాడు వైఎస్ జగన్.

 

పీసీసీ అధ్యక్షురాలు హోదాలో జగన్ సర్కారు లోపాలను ఎత్తిచూపటం మొదలుపెట్టిన షర్మిల పై వైసీపీ సోషల్ మీడియా దాడి మొదలైంది. ఎంతగా అంటే తన కుమారుడి వివాహానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించడంపై కూడా నిజమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సొంత చెల్లి పై ఇలాంటి దారుణమైన కామెంట్లు చేస్తున్న జగన్ స్పందించడం లేదంటే ఇది ఆయన దృష్టికి వెళ్లలేదా లేదంటే పరోక్షంగా ఆయనే ప్రోత్సహిస్తున్నారా అని అంశంపై చర్చ జరుగుతోంది. జగన్ కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారు.

చెల్లిని అవసరాలకి ఉపయోగించుకోవటమే కానీ ఏనాడు ఆమెకి రాజకీయ పదవులు ఇవ్వలేదు. రాజకీయంగా ఎదగనివ్వలేదు. దీంతోపాటు పలు కారణాలవల్ల వాళ్ళిద్దరి మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ప్రభుత్వాన్ని నేరుగా పలు విషయాలలో నిలదీస్తున్నారు. మధ్య నిషేధం చేసి ఓటు అడుగుతామన్నారు. మద్య నిషేధం లేదు, రోడ్లు లేవు, పోలవరం లేదు, మెట్రో లేదు ఇప్పుడు ఓటు అడిగే అర్హత కూడా లేదు.

 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక, మద్యం, మాఫియా. అయితే దాచుకోవడం లేకపోతే దోచుకోవటం సాధారణ అయిపోయింది. బీజేపీ కి జగన్ తొత్తుగా మారారు. స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బిజేపీ కి వైసీపీ అమ్ముడుపోయింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది. ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమల వచ్చేవి ఐదేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధిస్తుంటే సమాధానాలు చెప్పలేక షర్మిలను టార్గెట్ చేయడం నిజంగా నీచమైన పని అంటున్నారు ప్రజలు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -