Shiva Jyothi: ముచ్చటగా మూడోసారి కారు కొన్న శివ జ్యోతి.. వైరల్ అవుతున్న ఫోటో!

Shiva Jyothi: సాధారణంగా విజయదశమి పండుగ సందర్భంగా ఏదైనా ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే అంత శుభం కలుగుతుందని భావిస్తారు ఇలా పండుగ సమయంలో పెద్ద ఎత్తున కొత్త బైక్స్ కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు.అయితే ఈ విజయదశమి సందర్భంగా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బిత్తిరి సత్తి, షణ్ముఖ్ జస్వంత్, వైవా హర్ష రచ్చ రవి వంటి వారు కొత్త కారులను కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే యాంకర్ శివజ్యోతి సైతం విజయదశమి సందర్భంగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. దసరా పండుగ సందర్భంగా బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశారు.ఒక సాధారణ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ జ్యోతి తీన్మార్ సావిత్రిగా తెలంగాణ భాషలో గలగల మాట్లాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా తీన్మార్ వార్తలతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు రోజుకు తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చారు.ఇలా సోషల్ మీడియా ద్వారానో బుల్లితెర కార్యక్రమాల ద్వారానో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ శివజ్యోతి భారీగానే సంపాదిస్తున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివ జ్యోతి కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.అయితే ఆ ఇంటికనుగుణంగా ఓ మంచి ఖరీదైన కారు ఉంటే బాగుంటుందని భావించిన శివ జ్యోతి విజయదశమి సందర్భంగా ఖరీదైన కారును కొన్నారు.
ఈ సందర్భంగా శివ జ్యోతి కొనుగోలు చేసిన ఈ కారు ఖరీదు సుమారు 51 లక్ష రూపాయలు విలువ చేస్తున్నట్లు తెలుస్తోంది.శివ జ్యోతి బిగ్ బాస్ షణ్ముఖ ఇద్దరు కూడా ఒకే మోడల్ కార్లను కొనుగోలు చేశారు. ఇలా శివ జ్యోతి ఇదివరకే రెండు కార్లను కొనుగోలు చేయగా ముచ్చటగా మూడోసారి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు. తన భర్తతో కలిసి కొత్త కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Revanth Reddy Challenges KTR: నువ్వు మొగోడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

CM Revanth Reddy Challenges KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన జాతర పేరిట నిర్వహించినటువంటి...
- Advertisement -
- Advertisement -