YS Jagan: జగన్ ను హర్ట్ చేసేలా షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

YS Jagan: సాధారణంగా ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏం జరుగుతుంది అంటే కేవలం రాజకీయాలు మాత్రమే జరుగుతాయని అభివృద్ధి అనేది జరగదని పలువురు ప్రస్తుత అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇలా అధికార ప్రభుత్వంపై కేవలం సొంత రాష్ట్ర నాయకులు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నాయకులకు కూడా ఏపీ అధికార నేతలపై విమర్శలు చేయడం ఎంతో సిగ్గుచేటు.

తాజాగా ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజుల క్రితం ఈయన మాట్లాడుతూ జగన్ పై పెట్టిన కేసులలో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుగుతుంది ఈ దర్యాప్తు ముగిస్తే జగన్ ఏ జైలుకు వెళ్తారో తెలియదు.ఇలా తన భవిష్యత్తుపై తనకే నమ్మకం లేనటువంటి జగన్ ఆంధ్రప్రదేశ్లో గడపగడపకు వెళ్తూ నువ్వే మా నమ్మకం జగనన్న అంటూ స్టిక్కర్లు అతికించడం విడ్డూరం అని తెలిపారు.

 

ఇలా గతంలో రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు అయితే తాజాగా మరోసారి ఈనెల తొమ్మిది నుంచి జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనిపై కూడా ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటూ ఏనాడైనా ప్రజలని కలవని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రామకృష్ణ ఎద్దేవా చేశారు.

 

కేవలం ఈయన బటన్ నొక్కాడానికి మాత్రమే బయటకు వస్తున్నారని తెలియజేశారు ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు కూత వేట దూరంలో అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న ఆయనకు మాత్రం కనపడలేదు కనీసం రైతులను పిలిచి వారి సమస్యకు పరిష్కారం తెలియచేద్దాం అన్న ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి లేరని తెలిపారు. ఏ ఒక్కరోజు కూడా రాష్ట్రంలో ప్రజల వద్దకు వచ్చి ప్రజల గురించి ఆలోచించిన సందర్భాలు లేవు ప్రజల సమస్యల నుంచి ఆయన అందుకున్న అర్జీలు లేవని తెలిపారు.

 

ఇలా ఏ సమస్యలను పట్టించుకోని ఈ ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో జగనన్నకు చెబుదామని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక నేడు (మే 3) ఈయన భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన రెండో సారి చేయడానికి వస్తున్నారు. అదే రోజు నుంచి మేము కూడా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తామని, చిత్తశుద్ధి ఉంటే వచ్చి సంఘీభావం తెలపాలని రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి కి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరికీ సవాల్ విసిరారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan Nomination Rally: పిఠాపురంలో జనసునామి.. పవన్ కళ్యాణ్ ఊహించని మెజార్టీతో గెలవబోతున్నారా?

Pawan Kalyan Nomination Rally: రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే క్రమంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన వెనక వచ్చిన జన...
- Advertisement -
- Advertisement -