Water: ఫ్రిడ్జ్ లో వాటర్ తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఏం జరిగిందంటే?

Water: వేసవికాలం మొదలయ్యింది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి సంకోచిస్తున్నారు. భానుడు తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇకపోతే ఎండాకాలం వచ్చింది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కూల్ డ్రింక్స్. మరి ముఖ్యంగా చాలామంది ఎండాకాలం డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లటి నీళ్లను తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఫ్రిజ్లో పెట్టిన కూల్ వాటర్ ని తాగుతూ ఉంటారు.

 

అయితే ఫ్రిజ్లో నీరు తాగే వారు ఎండాకాలం చాలా రకాల ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందట. మరి కూల్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్నం తిన్న వెంటనే కూల్ వాటర్ తాగడం వల్ల అది జీవక్రియ పై ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చల్లని నీరు తాగడం వల్ల గుండెలోని వాగస్ నరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తద్వారా అది గుండెపోటుకు కారణం కావచ్చు.

చల్లని నీరు ఎక్కువగా తాగడం వల్ల గొంతులో ఉండే రక్షితపొర దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చల్ల నీరు తాగడం ద్వారా శరీరంలో ఉండే కొవ్వు బయటకు పోవడానికి ఆస్కారం ఉండదు. దాంతో అధిక బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఎక్కువ చల్ల నీటిని తాగుతూ ఉంటారు. అధిక కూల్ ఉండే వాటర్ తాగడం వల్ల పంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా చల్లని నీరు తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. పోషకాలు కూడా దానికి అందవు. దాంతో కడుపునొప్పి వికారం మలబద్దకం గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి.

 

అంతేకాకుండా చలనీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్,పల్స్ రేట్ తగ్గి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు అలాగే, బరువు తగ్గాలి అనుకున్న వారు ఈ చల్లని నీటికి దూరంగా ఉండటం మంచిది. అయితే ఇలా ఫ్రిజ్లో అధిక కూల్ వాటర్ తాగడం కంటే మట్టి కుండలోని నీరు తాగడం అన్ని రకాలుగా మంచిది అంటున్నారు నిపుణులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -