Akira Nandan: అకీరా ఎంట్రీ గురించి షాకింగ్ న్యూస్ వైరల్.. ఏమైందంటే?

Akira Nandan: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఏమిటంటే పవన్ తనయుడు అకిరానందన్ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు. ఇదే విషయం గురించి గతంలో అనేక రకాల చర్చలు కూడా కొనసాగాయి. ఈ విషయంపై రేణు దేశాయ్ కూడా పలు సార్లు స్పందించింది. అయితే పవన్ అభిమానులకు ఒక చక్కని శుభవార్త. అకిరా నందన్ సినిమా ఎంట్రీ ఫిక్స్ అయ్యింది.

అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాతోనే. నమ్మడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ వార్త అఫీషియల్ గా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ eదూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నారట.
ఇక్కడితో అయిపోలేదు ఇదే సినిమాలో అకిరా నందన్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నారట. నిజంగా ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కెక్కించే న్యూస్ అని చెప్పవచ్చు.

పవన్‌కు సుజీత్‌ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఒక రేంజ్ లో ఉండనుందని అంతా ఫిక్స్ అయ్యారు.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అకీరా నందన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ టీనేజర్, కాలేజ్ స్టూడెంట్, గ్యాంగ్‌స్టర్‌గా మూడు వేరియేషన్స్‌లో కనిపించనున్నారట. అయితే పవన్ టీనేజ్ రోల్ కోసం అకీరా నందన్‌ని తీసుకోవాలని సుజీత్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంటే 17 ఏళ్ల టీనేజ్ కుర్రాడి క్యారెక్టర్ ను అకిరా నందన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -