Uday Kiran: ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి సంచలన విషయాలు బయటపెట్టిన సొంత అక్క!

Uday Kiran: తెలుగు సినీ ప్రేక్షకులకు దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. కాగా తెలుగులో ఉదయ్ కిరణ్ నువ్వు నేను, చిత్రం, మనసంతా నువ్వే లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి మంచి విజయం సాధించాయి. కెరిర్ బాగా ఉన్న సమయంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. అయితే ఉదయ్ ఆత్మహత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత అనేక రకాల వార్తలు వినిపించాయి.

కాగా ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి గతంలో ఉదయ్ కిరణ్ గురించి అతని ఆత్మహత్య గురించి షాకింగ్ విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఉదయ్ కిరణ్ అతని భార్య విషిత వల్లే చనిపోయాడు అంటూ ఆమె కామెంట్స్ చేసింది. ఉదయ్ చిరంజీవి కూతురుతో నిశ్చితార్థం తర్వాత అనుకోని కారణాలవల్ల ఆ బంధానికి బ్రేక్ పడిందట. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ ఒక జర్నలిస్టుతో ప్రేమలో పడ్డారని ఆ ప్రేమ విఫలం అయింది అని ఇండస్ట్రీలో వార్తలు కూడా వినిపించాయి. అయితే చిరంజీవి తమకు సహాయం చేశారే తప్ప చెడు చేయలేదు అని ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి చెప్పుకొచ్చారు.

అయితే వరుస సినిమాలు ప్లాప్ కావడం అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకు వడ్డీతో సహా డబ్బులు చెల్లించి రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ పై ఎఫెక్ట్ పడిందని, అలాగే భార్య పట్టించుకోలేదు అన్న భావన కూడా ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం అని సమాచారం. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ చనిపోయిన ముందు రోజు కూడా అతని భార్య మరొక వ్యక్తి బర్త్డే పార్టీలో ఉన్నారని సమాచారం. అయితే కెరీర్ విషయంలో ఒడిదొరకులు ఎదురైన సమయంలో భార్య నుంచి సపోర్ట్ లేకపోవడంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ కు గురయ్యాడని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -