Agent: ఏజెంట్ మూవీకి షాకింగ్ ఫలితం.. ట్రైలర్ మరీ ఘోరంగా ఉందా?

Agent: అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటివరకు నాలుగు సినిమాలలో నటించారు. అయితే ఈ నాలుగు సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మినహా మిగిలిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. హీరో అఖిల్ కు సరైన హిట్ పడలేదని తెలుస్తోంది. ఇకపోతే ఈయన డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలనే పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్ కనుక చూస్తే మొత్తం హాలీవుడ్ స్టయిల్ యాక్షన్ సీన్లు పరుచుకున్నాయి. ట్రయిలర్ ఓపెనింగ్ లో, మధ్యలో, చివరగా ఇలా ఓ లెక్క ప్రకారం యాక్షన్ సీన్లు వేసుకుంటూ వెళ్లారు. ఈ ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు పెట్టారో అర్థం అవుతుంది.

లోకేషన్లు, యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి. ట్రయిలర్ ను కట్ చేయడంలో కాస్త హడావుడి జరిగినట్లు అనిపిస్తోంది. యాక్షన్ సినిమా కాబట్టి పెద్దగా డైలాగులకు ప్రాధాన్యత వుండదు. సాంగ్ లకు కూడా అంతే. హీరోయిన్ బిట్ ఒకటి కట్ చేసి వేసారు.ఇక ఈ ట్రైలర్ అంతా గందరగోళంగా అనిపిస్తుండడంతో కొంతమంది ట్రైలర్ పై కాస్త నిరుత్సాహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా రిజల్ట్ పై కొందరు అభిప్రాయానికి కూడా వచ్చారు.

తర్వాత చాలామంది ఈ సినిమా ద్వారా అఖిల్ బయటపడకపోవచ్చని ఈ సినిమా కూడా అఖిల్ కెరియర్లో ఫ్లాప్ సినిమా గాని మిగిలిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం ఈ సినిమా పైనే ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.ఇక ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు అయింది అంటూ తాజాగా అనిల్ సుంకర ఈ సినిమా బడ్జెట్ గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.మరి ట్రైలర్ కనుక చూస్తుంటే నిర్మాత ఈ సినిమా నుంచి బయటపడే అవకాశాలు లేకపోవచ్చని కొందరు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -