Samantha: సమంత ఇకపై అలాంటి సినిమాలకు అస్సలు పనికిరాదా.. అసలేం జరిగిందంటే?

Samantha: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పడం తెలియదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సమంతా పేరు కూడా ఒకటి. తరచూ సినిమాలకు సంబంధించి తన వ్యాధికి సంబంధించి ఇలా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది సమంత. సమంత సినిమాల విషయానికొస్తే ఆమె గత రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. తాజాగా విడుదలైన ఖుషి సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. తాను సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నట్లు సమంత ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తన వ్యాధికి సంబంధించిన చికిత్సను తీసుకుంటోంది సమంత. ఆ సంగతి అటువంటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత కెరీర్ కు సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవేమిటంటే రంగస్థలం సినిమా తర్వాత సమంత ఎంచుకుంటున్న సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయని తెలుస్తోంది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా లేడీ ఓరియెంటెడ్ రోల్స్ విలన్ రోల్స్ ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించింది. అలాంటి సమంతని ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ హీరోయిన్ గా చూసేందుకు ఆడియన్స్ సిద్ధంగా లేరని తాజాగా విడుదలైన ఖుషి సినిమా నిరూపించింది.

మొదటి ఆట నుండే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ అనే చెప్పవచ్చు. సినిమా బాగున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగలడానికి కారణం సమంత అని అంటున్నారు విశ్లేషకులు.

ఆమె రొమాన్స్ చేయడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోయారని, అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందని అంటున్నారు. మరోపక్క నెటిజెన్స్ నీకు ఇలాంటి రోల్స్ ఇక పనికి రావు, పొయ్యి విలన్ రోల్స్ చేసుకో అంటూ సమంత పై కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సమంత రొమాంటిక్, అలాగే రెగ్యులర్ హీరోయిన్గా సెట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -