Hero Balakrishna: అన్‌స్టాపబుల్ షోలో షాకింగ్ సీన్.. బాలయ్య నోట బూతు మాట!

Hero Balakrishna: నందమూరి బాలకృష్ణ వెండితెరపై తన యాక్టింగ్‌తో మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించడమే కాదు.. యాంకర్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికపై సత్తా కూడా చాటుతున్నారు. అన్‌స్టాపబుల్-2తో మరోసారి రంగంలోకి దిగిన బాలయ్య.. హోస్ట్ గా సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు. సరదా సంభాషణతోనే సెలబ్రిటీల సీక్రెట్స్ బయటపెడుతూ అన్‌స్టాపబుల్ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఈ షో తొలి సీజన్ విజయవంతమైంది. దీంతో అదే జోష్‌లో రెండో సీజన్ మొదలు పెట్టారు ఆహా టీమ్. అయితే సీజన్-2 రెండో ఎపిసోడ్‌లో బాలయ్య నోటి వెంట వచ్చని ఓ బూతు మాట హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జనాల్లో ఇదే ఇష్యూగా నడుస్తోంది.

అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్‌లో ఇద్దరు యువ హీరోలు గెస్ట్ గా వచ్చారు. రియల్ లైఫ్‌లో మంచి స్నేహితులైన సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌లను బాలయ్య ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇద్దరు యువ హీరోలు కలిసి తమ సినీ కెరీర్, ఇతర విషయాలను షేర్ చేసుకున్నారు. బాలయ్య బాబు అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానాలు చెబుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపారు. అయితే ఈ క్రమంలో బాలయ్య బూతులు మాట్లాడటం సంచలనంగా మారింది. ఇందులో బాలయ్య.. ‘నీకో అవకాశం ఇస్తున్న.. నువ్వు నన్ను డైరెక్ట్ చేయూ..’ అని అంటాడు. అప్పుడు విశ్వక్‌సేన్ ‘మీకు ఫ్యాన్స్ కావాలా?, హీరోయిన్ కావాలా? అని అడుగుతాను. దానికి మీరు మింగితే షేప్ అవుట్ అవుతావు.’ అని సమాధానం చెప్పాలంటాడు. అదే డైలాగ్‌ను బాలకృష్ణ రిపీట్ చేయగా.. ఆయన నోటి వెంట మింగితే మాటకు బదులు బూతు మాట వస్తుంది.

ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు ఈ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ క్లిప్ వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ ఎక్కడా సీరియస్‌గా తీసుకోలేదు. యూత్ ఆడియన్సే టార్గెట్‌గా ఈ ఎపిసోడ్‌ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఇంటర్వ్యూ కొనసాగింది. యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కించే ప్రశ్నలతో సిద్ధు జన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌లపై బాలయ్య అటాక్ చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఆహాలో అందుబాటులో ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -