Mahesh Babu: మహేష్ బాబు కొత్త లుక్స్ గురించి ఆందోళన చెందుతున్న అభిమానులు!

Mahesh Babu: టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రిన్స్ మహేష్ బాబు పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాజకుమారుడు సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ హీరోగా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు సంపాదించుకున్నాడు మహేష్. మొత్తానికి మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు.

ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేష్ కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులలో ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడు. దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ఏ మాత్రం చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం. ఇటీవల సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చిన మహేష్. ఆ సినిమా తో ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు.

మొత్తానికి మహేష్ బాబు టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబుకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసినా మహేష్ అభిమానులు ఏమాత్రం సాటిస్ఫై అవడం లేదు. ఎస్ ఎస్ ఎమ్ బి 28 సినిమా షూటింగ్ ఫస్ట్ డే జరిగిన షూట్ లో ఫోటోలు, లేటెస్ట్ గా వదిలిన మహేష్ బాబు సెల్ఫీ ఫోటోలు తన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు ఎప్పటి లుక్ లోనే కనిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మహేష్ లుక్ లో కొంచెం చేంజ్ కనిపిస్తుంది. రీసెంట్ గా విడుదలైన ఫోటోల లో మొహం లో ఏమాత్రం గ్లో లేదు. హెయిర్ స్టైల్ ఒత్తుగా కనిపించినప్పటికీ దాంట్లో కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. ఇక ఈ ఫోటోలు చూసిన మహేష్ బాబు అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.

1

2

3

4

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -