Life: ప్రాణం పోయినా ఈ తొమ్మిది విషయాలను ఎవరికీ చెప్పకూడదా.. చెబితే మాత్రం నష్టపోయినట్టేనా?

Life: జీవితంలో మనకి ఎంత దగ్గర బంధువులు అయినా.. ఎంత ప్రాణ స్నేహితులైన చాలా విషయాలు అందరితో షేర్ చేసుకోకూడదు. అందులోనూ ఈ తొమ్మిది విషయాలు అసలు షేర్ చేసుకోకూడదు. ఇలా షేర్ చేసుకోవడం వలన మంచి సంగతి పక్కన పెడితే అసూయ ద్వేషాలకి బలవుతారు. కాబట్టి పక్క వాళ్ళతో పంచుకోకూడని విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏ ఇంట్లో అయినా గొడవలు జరుగుతూనే ఉంటాయి. దానిని పెద్దది చేసి అటు బంధువులకి గాని ఇటు ఫ్రెండ్స్ కి గాని చెప్పుకోవడం వలన మరింత చులకన అవుతాం.

తప్పితే మన సమస్య తీరదని గుర్తుంచుకోవాలి. అలాగే కరెక్ట్ వయసు బయట వారు ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శాస్త్ర ప్రకారం బయట వాళ్ళకి మన వయసు కరెక్ట్ గా చెప్తే ఆయుషు తగ్గుతుందని పెద్దలు ఇదివరకే చెప్పి ఉన్నారు. అలాగే మన సంపాదన కూడా బయట వారికి అస్సలు తెలియకూడదు. సంపాదన ఎక్కువైతే వారి అసూయకి గురవుతాము, సంపాదన తక్కువైతే వారు చేసే చులకనకి గురవుతాము.

 

అలాగే మనం చేసిన దానం కూడా ఎవరికి చెప్పకూడదు. కుడిచేత్తో చేసింది ఎడం చేతికి కూడా తెలియకుండా దానం చేయడం ఎంతో ఉత్తమం. అలాగే మనకి జరిగిన గౌరవ పురస్కారాలు గురించి కూడా మన నోటి ద్వారా మనం చెప్పకూడదు. మన వైభవం గురించి బయటివాడు చెప్పకుంటే పరవాలేదు కానీ మన నోటితో మనం చెప్పుకోవడం వలన మనం చులకన అవుతాము. మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది.

 

అలాగే మనం ఇచ్చే ఔషధం గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు. ఆ మందు పని చేయవచ్చు.. పనిచేయకపోవచ్చు మంచి జరిగితే పర్వాలేదు కానీ చెడు జరిగితే నువ్విచ్చిన మందు వల్ల నాకే పరిస్థితి వచ్చింది అని అంటారు. ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్లే ఉండరు కదా. మనల్ని చూసి అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల గురించి ఎవరితోనూ చర్చించ కూడదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -