Lovers: ప్రియుడి ప్రాణం తీసిన గాఢమైన ముద్దు

Lovers: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అంటే ఇదే.. జైల్లో ఉన్న తన ప్రియుడికి ఎవరికి తెలియకుండా డ్రగ్స్‌ ఇవ్వాలనుకుంది. అది బెడిసి కొట్టి అతడి ప్రాణాలు పోయాయి. అది కూడా లిప్‌లాక్‌ ద్వారా ప్రియుడి ప్రాణాలు పోయాయనే వార్త వినగానే అందరు ఖంగుతిన్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు అసలు విజయం తెలిసింది. జైలు శిక్ష అనుభిస్తున్న తన ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన ప్రియురాలి వచ్చే ముందు అతడికి గాఢమైన ముద్దు పెట్టి వచ్చింది. అంతే.. ఆమె బయటకు వెళ్లిన కొద్ది సేపటికే అతడు మృత్యువాత పడిన ఘటన అమెరికాలోని టెన్సన్‌ నగరంలో జరిగింది.

అదే ప్రాంతాలనికి జాషు అనే వ్యక్తి డ్రక్స్‌ సరఫరా కేసులో పోలీసులకు దొరికి పోయాడు. కేసు విచారించిన కోర్టు అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో జాషును పోలీసులు టెన్సన్‌లోని జైలుకు తరలించారు. అయితే.. అప్పుడప్పుడు జాషును కలువడానికి వచ్చిన అతడి ప్రియురాలు రాచెల్‌కు తనకు డ్రక్స్‌ కవాలని అడిగేవాడు. అయితే పోలీసుల కళ్లుగప్పి అతగాడికి డ్రక్స్‌ ఇవ్వాలని చాలా సార్లు అనుకుంది కాని అది కుదరాలేదు. ఈ సారి ఎలాగో డ్రగ్స్‌ ఇవ్వాలనుకుంది. రాచెల్‌ తన నోటి ద్వారా 0.5 ఔన్స్‌ మెథాంఫెటామైన్‌ అనే డ్రగ్స్‌ను జాషు నోట్లోకి వదలాలని నిర్ణయించుకుంది.

ఈ ప్లాన్‌ను పక్కగా అమలుచేయాలని భావించి జాషును కలిసేందుకు జైల్‌కు వచ్చింది. చాలా సేపు మాట్లాడి వెళ్తు వెళ్తు ఇద్దరు లిప్‌లాక్‌ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో ఆమె నోట్లో ఉన్న డ్రక్స్‌ను ఆమాంతగా జాషు నోట్లోకి వదిలింది. ఆ తర్వాత రాచెల్‌ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే జాషు స్పృహతప్పి పడిపోయాడు. గమనించి సెంట్రిలు వెంటనే అతడిని లేపేందుకు ప్రయత్నించగా ఎంతకీ లేవలేదు. హుటాహుటిని హుటాహుటిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యంలో జాషు చనిపోయాడు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా రాచెల్‌ వచ్చిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఖంగుతున్నారు. ఇద్దరు కిస్‌ పెట్టుకుంటునప్పడు రాచెల్‌ నోటి నుంచి డ్రగ్స్‌ జాషు నోట్లుకి వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ డ్రగ్స్‌ను పొరపాటున జాషు మింగేయడంతో ఓవర్‌ డోస్‌ కావడంతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముద్దు ప్రియుడు చనిపోయిన ఘటన అప్పుడు అమెరికాలో సంచలనం రేపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -