Perni Nani: ఆధారాలు చూపించు పవన్.. ఆరోపణలు చేస్తే సరిపోతుందా?

Perni Nani: ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. పవన్ వ్యాఖ్యలకు వాలంటీర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ పవన్ కళ్యాణ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ పై తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాళ్లు మొక్కితే తాము ఎవరు మాట్లాడడం కానీ వాలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడితే అసలు సహించబోమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ఏక వచనంతో పిలిచి చూడాలని చాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు మాత్రమే నాలుక లేదు వైసీపీ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నాలుక ఉందనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని తెలిపారు.

 

వైసిపి వాలంటీర్ ద్వారా ఎన్నో మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు చేశారు.మరి చంద్రబాబు నాయుడు హయామంలో దాదాపు 16 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబు ఏది చెబితే అది మాట్లాడటం కాదని దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు.చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లు చేస్తున్నటువంటి పనితీరును చూసి భయపడుతున్నారని అందుకే వారిపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

 

ఇలా వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని తప్పించాలన్న ఆలోచనలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందని తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగిస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టి చూడగలరా అంటూ పేర్ని నాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు.చంద్రబాబు నాయుడుతో రాజకీయాలు చేయడానికి పవన్ సరిపోతారని గతంలో చిరంజీవి గారు అన్నారు అయితే ఆయన ఎందుకలా అన్నారో ఇప్పుడు అర్థమైందని తన అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ పవన్ కళ్యాణ్ కు నాని తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -