Shraddha Das: హైపర్ ఆదికి శ్రద్దా దాస్ ముద్దు ఆఫర్.. ఎగిరి గంతేస్తున్న కామెడీ స్టార్

Shraddha Das: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ చూసే ప్రతిఒక్కరికీ అతడు పరిచయమే. జబర్తస్త్ లో సీనియర్ కమెడియన్ ఉన్న హైపర్ ఆది.. తన పంచులతో, తన మార్క్ కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. జబర్దస్త్ లో వచ్చిన పేరుతో పలు సినిమాల్లో కూడా కమెడియన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక జబర్దస్త్ లో వచ్చిన మంచి పేరుతో హైపర్ ఆదికి శ్రీదేవి డ్రామా కంపెనీ, డీ-14 షోలలో కూడా అవకాశం వచ్చింది.

ఆ షోలలో కూడా తన పంచులతో హైపర్ ఆది కామెడీ పండిస్తున్నాడు. జడ్జిలపై పంచ్ లు వేస్తూ తన మార్క్ కామెడీ పండిస్తున్నాడు. సహచర కమెడియన్స్ పై పంచులు పేలుస్తూ బుల్లితెరపై ప్రేక్షకులను సంపాదించుకుంటున్నాడు. డీషోకు వచ్చే హీరోయిన్స్ ను నవ్విస్తూ వారిపై తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. గతంలో ప్రియమణిని నవ్విస్తూ ఆమె అందాలను పొగడుతూ ప్రేమను ఒలరబోశాడు. అయితే తాజాగా ఢీ-14షోకు హీరోయిన్ శ్రద్దా దాస్ వచ్చింది. దీంతో హైపర్ ఆది ఈ బ్యూటీపై తన ప్రేమను చూపించాడు. తాజాగా విడుదలైన ప్రొమోలో హైపర్ ఆదికి శ్రద్దా ముద్దు ఆఫర్ ఇచ్చింది. మంచుగడ్డపై కొంచెం సేపు నిలబడితే ముద్దు ఇస్తానంటూ శ్రద్దా ఆఫర్ ఇచ్చింది.

దీంతో శ్రద్దా ముద్దు కోసం హైపర్ ఆది మంచుగడ్డపై నిల్చున్నాడు. మంచుగడ్డపై నిల్చుని శ్రాద్దా దాస్ పై పాటలు కూడా పాడాడు. దీంతో శ్రాద్దా దాస్ హైపర్ ఆది పాటలను చూసి నవ్వుకుంటున్నట్లు ప్రొమోలో ఉంది. మంచుగడ్డపై నిల్చున్న తర్వాత హైపర్ ఆదికి శ్రద్దాదాస్ ముద్దు ఇచ్చిందా.. లేదా అనేది ప్రొమోలో చూపించలేదు. ఆగస్టు 24న ప్రసారం కానున్న ఎపిసోడ్ ను చూస్తే కానీ అది తెలియదు. మొత్తానికి ప్రొమో మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -