Shruthi Haasan: శృతిహాసన్ అంతమంది హీరోలతో ఎఫైర్ నడిపిందా?

Shruthi Haasan: సూపర్ స్టార్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ.. తన సొంత టాలెంట్‌తో అంచలంచెలుగా ఎదుగుతోంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అయితే శృతిహాసన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కెరీర్ మొదటి నుంచే శృతిహాసన్ లవ్ ఎఫైర్లు నడిపింది. నిర్మోహమాటంగా సోషల్ మీడియాలో బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

 

శృతిహాసన్ ఎప్పుడూ లవర్స్ ను మారుస్తుంటుందని బాలీవుడ్ మీడియా కథనాలు కూడా ప్రచారం అవుతున్నాయి. అలాగే ఇండస్ట్రీకి చెందిన పలువురితో శృతిహాసన్ ఎఫైర్లు నడిపించిందని వార్తలు వినిపించాయి. ఈ లిస్ట్ లో మొదటగా హీరో సిద్ధార్థ్ పేరే ఉంటుంది. టాలీవుడ్‌లో శృతిహాసన్ మొదటి చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’. ఈ సినిమాలో సిద్ధార్థ్ కథానాయకుడిగా చేశాడు. సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్-శృతిహాసన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. అప్పట్లో శృతిహాసన్ ప్రేమలో పడిందంటూ జోరుగానే ప్రచారం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఓ మై ఫ్రెండ్’ సినిమా వచ్చింది. ఈ సినిమాతో వీరిద్దరు లవర్స్ అని నెటిజన్లకు కన్‌ఫర్మ్ చేసుకున్నారు. అయితే వీరిద్దరి బంధం ఎక్కువ రోజులు ముందుకు సాగలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.

 

సిద్ధార్థ్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో శృతిహాసన్ ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ డేటింగ్ చేసుకున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ పుకార్లలో ఎంత నిజముందో తెలియదు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ పుకార్లు వాటంతట అవే సద్దుమణిగాయి. అలాగే ఇండస్ట్రీలో హీరోలే కాకుండా.. ఇతర రంగాలకు చెందిన యువకులతో కూడా డేటింగ్ చేసింది. క్రికెటర్ సురేష్ రైనా, ఇటాలియన్ మైఖేల్ కొర్సాల్‌తో శృతిహాసన్ ఎఫైర్స్ నడిపింది. అయితే వీరితో కూడా ఎక్కువకాలం రిలేషన్‌షిప్ కొనసాగించలేదు. ప్రస్తుతం ఈ భామ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -