Shruti Haasan: శృతి హాసన్ లో మరో కోణం రివీల్.. ఇలాంటి అమ్మాయా?

Shruti Haasan: తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శృతిహాసన్.. స్టార్ హీరోల అందరితో సినిమాలు చేసింది. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల అందరితోనూ నటించింది. ఇక తమిళంలోనూ స్టార్ హీరోల అందరితో నటించిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

 

ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాలో శృతిహాసన్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రవితేజ సరసన క్రాక్ సినిమాలో కూడా యాక్షన్ సీన్స్ తో శృతిహాసన్ ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ నటిస్తోంది.

 

వరుస సినిమాతో బిజీగా ఉన్న శృతిహాసన్ తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో శృతిహాసన్ గుర్తు పట్టలేని విధంగా ఉంది. పూర్తిగా ఆమె ఫేస్ మొత్తం మారిపోయింది. శృతిహాసన్ కు ఫీవర్ గా ఉండటంతో పాటు సైనస్ తో బాధపడుతుందట. దీంతో ఆమె ముఖం మొత్తం లాగేసినట్లు, పెదాలు పీకేసినట్లు మారిపోయాయి. తన ముఖం ఎలా ఉన్నా ఫ్యాన్స్ తనను యాక్సెప్ట్ చేస్తారంటూ శృతిహాసన్ ఆ ఫొటోలను షేర్ చేస్తూ రాసుకొచ్చింది.

శృతిపై మండిపడుతున్న నెటిజన్లు

అలాగే తనకు పీరియడ్స్ కూడా రావడంతో ఇలా అయిపోయానంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. దీంతో శృతిహాసన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది నెటిజన్లు ఆ పోస్ట్ పై మండిపడుతున్నారు. ఆడవాళ్ల ప్రైవసీ మ్యాటర్ ను ఇలా బయటపెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బోల్డ్ నెస్ పనికి రాదంటూ సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -