Shruti Haasan: ఆ కామెంట్లపై శృతి హాసన్ షాకింగ్ రియాక్షన్.. ఏం జరిగిందంటే?

Shruti Haasan: లోక నాయకుడు కమలహాసన్ గారాల పట్టిక బోల్డంత పేరు ఉంది శృతిహాసన్ కి. అయితే తండ్రి చాటు బిడ్డగా పెరగటం ఇష్టంలేని శృతిహాసన్ తనకంటూ ఓన్ ఐడెంటిటీని సంపాదించుకునే పనిలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. బిగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ తనకు నచ్చినట్లుగా లైఫ్ లీడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు చేరువ లో ఉంటుంది.

 

అయితే శృతికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం తన ఫోటో షూట్ లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఫిట్స్ తో చేస్తూ ఉంటుంది. దీనిపై చాలామంది శృతిహాసన్ ని ట్రోల్స్ కి గురి చేశారు. అయితే ఈ విషయంగా స్పందించిన శృతిహాసన్ అందరూ అందరికీ నచ్చరు ఎవరైనా నన్ను దెయ్యం, భూతం అని పిలిచినా నేను పొగడ్తగానే భావిస్తాను తప్ప బాధపడను అంటుంది. ఒక మహిళా ఆర్టిస్టు పొగడ్తలే కాదు అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి.

ఇతరుల అభిప్రాయాలకు భయపడటం బాధపడటం లాంటివి చేయకూడదు. నేను కూడా అంతే నా అభిప్రాయం నాది నాకు మొదటి నుంచి నలుపు రంగు లోహాభరణాలు ధరించడం ఇష్టం. మెటల్స్ ని కేవలం సంగీతంపై ఇష్టం ఉన్నవారు మాత్రమే ధరించరు అవి నాలో శక్తిని రెట్టింపు చేస్తాయి. ఈ ఆభరణాలు నచ్చని కొందరు దయ్యంలా ఉన్నావు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు.

 

అయితే వాటిని నేను పెద్దగా పట్టించుకోను అని సమాధానం చెప్పింది శృతిహాసన్. అలాగే తనని చాలామంది నాచురల్ బ్యూటీ కాదు అని విమర్శిస్తూ ఉంటారట ఆ విషయం గురించి కూడా స్పందిస్తూ నిజమే నేను నాచురల్ బ్యూటీ ని కాను కానీ నన్ను నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఎంతో ఇష్టపడతాను అని చెప్పింది ఈ భామ. నిజంగా ఈమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -