AP Police: ఏపీ పోలీస్ స్టేషన్ లో ఏకంగా ఇలాంటి పరిస్థితా.. ఘోరమంటూ?

AP Police: ఏపీ రాజకీయాలతోపాటు పోలీసు వ్యవస్థ అత్యంత దారుణంగా తయారు అయ్యింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల కాళ్లు నొక్కెళ్లేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అవసరం అయితే వారికి పాదపూజ కూడా చేస్తాం అనే స్థాయికి వచ్చారు. ప్రతిపక్ష పార్టీల నేతలే టార్గెట్ గా అక్రమ కేసులు, దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలపై పోలీసు జూలం ప్రదర్శించటంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.

ఖాకీ బట్టలు వేసుకున్న చాలా మంది అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఐపీఎస్ సెక్షన్ల ప్రకారం అస్సలు నడుచుకోరు. పైగా అక్కడడక్కడ అధికార పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటారు. పోలీసు వ్యవస్థలో కొందరు చేసే తప్పులకు అందరూ బాధ్యతవహించాల్సిన దుస్థితి.

 

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కావలి పర్యటనకు వచ్చారు. అక్కడ సభ ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సందర్శంగా కావలి ఎమ్మెల్యే అవినీతి గురించి ముఖ్యమంత్రికి చెప్పేందుకు స్థానిక బీజేపీ నేతలు వెళ్లారు. సీఎం వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇస్తామంటే పోలీసులు ఒప్పుకోరు కదా. అలానే బీజేపీ నేతల్ని అడ్డుకున్నారు కావలి పోలీసులు. అయితే తమను ముఖ్యమంత్రి వద్దకు వెళ్లేందుకు అనుమతించాల్సిందేనంటూ పట్టుబట్టి ఆందోళన చేపట్టారు.

 

ఎమ్మెల్యే అవినీతిపై నిరసన చేస్తున్న బీజేపీ నేతలపై ఏపీ పోలీసులు కర్కశంగా వ్యవహరించారు.పోలీసుల తోపులాటలో బీజేపీ నాయకుడు సురేశ్ కింద పడ్డారు. ఆయన తలను తన రెండు బూటు కాళ్లమధ్య ఇరికించిన డీఎస్పీ వెంకటరమణ బలంగా అదిమేశారు. దీంతో బాధతో సదరు బీజేపీ నేత ఊపిరి ఆడక విలవిల్లాడారు. అయినప్పటికీ డీఎస్పీ మాత్రం తన పట్టు విడవలేదు. ఈ తీరు షాకింగ్ గా మారింది. చేతుల్ని పక్కకు వంచి చిత్రహింసలు పెట్టినట్లుగా చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -