Singer Sunitha: వైరల్ అవుతున్న సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు!

Singer Sunitha: తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఎన్నో మంచి మంచి పాటలను పాడి సింగర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది సునీత. ఈమె సింగర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ లతో సమానంగా క్రేజ్ ని సంపాదించుకుంది. నాలుగు పదుల వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ భారీగా అభిమానులను సంపాదించి ఉంది. మరి ముఖ్యంగా సింగర్ సునీత స్వీట్ వాయిస్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా సింగర్ సునీత బిజినెస్ మాన్ రామ్ వీరపనేని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

 

భారీగా ట్రోలింగ్స్ కూడా జరిగాయి. ఇక మొన్నటి వరకు సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించడంతో ఆ వార్తలపై స్పందించిన సునీత అటువంటిదేమీ లేదు అనే ఆ వార్తలను కొట్టి పడేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సునీతకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తనకు ఎదురైన ఒక అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో సదరు యాంకర్ టాప్ హీరోయిన్లకు సమానమైన ఫ్యాన్స్ బేస్ మీకు ఉందని, మీరు ట్రెండ్ సెట్టరా అని ప్రశ్నించారు..ఆ విషయం పై స్పందించిన సునీత.. నాకు తెలియదు అని సమాధానం ఇచ్చింది. తర్వాత వెంటనే సదరు యాంకర్.. అంటే మీకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ ఉంది అనేది మీరు ఒప్పుకోవడం లేదా అని అడగగా.. ఇలాంటి కొన్ని అంశాలు తనని చాలా ఇబ్బంది పెడతాయని ఆమె తెలిపింది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నేను ఎప్పుడు ఆలోచించే విషయం ఇదే..వారందరూ నా పాట అంటే ఇష్టపడతారా? లేక నా చీరను ఇష్టపడతారా? నేను అందంగా ఉంటానని ఇష్టపడతారా? అదే నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్లిన మేడం మీ పాట అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలకరిస్తారు అంటూ ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. సింగర్ సునీత ఒక ఈవెంట్ కి వెళ్లినప్పుడు అక్కడ ఒక అతను సునీతని చూసి పరిగెత్తుకుంటూ వస్తుండగా చుట్టూ ఉన్న బౌసర్లు అతన్ని అడ్డుకోవడంతో ఆమె అతని వదిలేయమని చెప్పిందట. దీంతో సదరి వ్యక్తి సునీత దగ్గరికి వచ్చి ఫోన్లో ఆమె ఫోటో చూపించి మేడం ఈ చీర ఎక్కడ కొన్నారు చాలా బాగుంది ఇలాంటిది మా ఆవిడకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాడట. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది సింగర్ సునీత.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -