Sunitha: సునీతకు ఆస్తులు ఇవ్వకపోవడం వెనుక ఇంత కథ ఉందా?

Sunitha: టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరును సంపాదించారు. మొదటగా టీవీ షోలల్లో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీత.. 15 ఏళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘గులాబీ, ఎగిరే పావురమా’ సినిమాల్లో ఆమె పాడిన పాటలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు’ అనే పాటను పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

 

ఇప్పటివరకు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో.. దాదాపు 3 వేలకు పైగా పాటలు పాడింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. సునీత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సునీత మొదటి వివాహం గురించి అందరికీ తెలుసు. అప్పటికే సునీతకు ఇద్దరు పిల్లలు. భర్తతో దూరమయ్యాక.. తన సొంత కష్టంతోనే పిల్లలను పెంచింది. వాళ్ల కెరీర్ సెట్ అయ్యేంత వరకు శ్రమించింది. చివరకు పిల్లల ఇష్టంతోనే రెండో పెళ్లి చేసుకుంది.

 

సునీత మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ జరిగింది. అయినా వీరు ట్రోలింగ్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రామ్ వీరపనేనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఆస్ట్రేలియాలో ఉన్నత చదవులు చదివిన రామ్.. ఇండియాకు తిరిగి వచ్చి వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. పలు కంపెనీల్లో వందల కోట్ల షేర్స్ ఉన్నాయి.

 

విదేశాల్లోనూ పలు బిజినెస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రముఖ మ్యూజిక్ సంస్థ మ్యాంగో మీడియాకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాదాపు అతడికి రూ.700 కోట్లకుపైగా ఆస్తి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ తన భార్య సునిత పేరుపై ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదట. దానికి కారణం సునితనే అని సమాచారం. ఒకవేళ ఆమె పేరుపై ఆస్తులు ఉంటే.. డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నట్లు అనుకుంటారని, అందుకే ఆమెపై ఒక్క రూపాయి రాణించుకోలేదని టాక్.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -