Tirupati: సెటిల్‌మెంట్ల కోసం ఏకంగా ఆఫీస్‌.. ఏం జరిగిందంటే?

Tirupati: తిరుపతిలో బాబు అండ చూసుకొని అన్నదమ్ముల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు అన్నదమ్ములకు టిడిపి అధినేత చంద్రబాబు అండగా నిలిచారని బాబు అండ చూసుకొని వాళ్ళు మరింత రెచ్చిపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో గంజాయి మధ్యస్తాలు, సెటిల్‌మెంట్లు, ఎర్రచందనం అక్రమ రవాణా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇద్దరు అన్నదమ్ముల పేర్లు తిరుపతి నుంచి అమరావతి వరకు వినిపిస్తూనే ఉన్నాయి. తిరుపతిలో ఆ ఇద్దరు అన్నదమ్ములు రౌ డీషీటర్లకు ఆరాధ్య దేవుళ్లు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌, రైల్యేస్టేషన్‌ వద్ద ఆ అన్నదమ్ముల అనుచరులు చేసే దందాల్లో బ్రదర్స్‌కి వాటా ఉంది.

 

అలాగే వాళ్ళపై ఈగ కూడా వాలకుండా చూసే బాధ్యత ఆ సోదరులే తీసుకున్నారు. తిరుపతి నగరంలో గంజాయి, మద్యం సేవించి గొడవలు చేసే చిల్లర బ్యాచ్‌లకు ఆ అన్న దమ్ములు ఐకాన్‌లని చెప్పవచ్చు. అన్నదమ్ముళ్లల్లో చిన్నవాడు ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించాడు. అన్న కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి జీవితాన్ని ప్రారంభించాడు. తమ్ముడు చేసే వెధవ పనులకు ఐడీ పార్టీలో పనిచేసే అన్న సహకారం ఉంది. చిన్నవాడు మొదటి నుంచి అల్లరి చిల్లరగా తిరుగుతూ గొడవలు చేసి స్థానికులు, యాత్రికులను కొట్టి డబ్బులు లాక్కోవడం అలవాటు. ఇందులో ఎవరైనా స్టేషన్‌ వరకు వెళ్లి కేసు పెట్టాలని చూస్తే అక్కడ తమ్ముడికి ఏమి కాకుండా అన్న మొత్తం చూసుకుంటాడు

 

దాంతో అన్న చూసుకొని ఆ తమ్ముడు మరింత ఇచ్చి పోయాడు. తిరుమలలో వ్యాపారుల మధ్యస్తాలు స్టేషన్‌కు వస్తే వారిని తిరుపతిలో ఉన్న తమ్ముడికి అప్పచెబుతాడు. దాన్ని పరిష్కరించే పనిలో అవతలి వారిని బెదిరించి, కొట్టి చిత్రహింసలకు గురిచేసి డబ్బు సంపాదించాడు అన్న. అంతేకాకుండా చిన్న సెటిల్మెంట్ అయినా కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారట. గొడవ చిన్నదైనా పగ తీర్చుకోవాలంటే ఈ అన్నదమ్ములకు చెబితే చాలు. అయితే వారు అడిగినంత ఇస్తే పనైపోతుందంటున్నారు. అలాగే ఏదైనా షాపుపై రైడ్‌ చేసి వారిని అక్కడ బెదిరిస్తే తిరుపతిలోనే సెటిల్మెంట్‌ చేస్తారు.ఇలా తిరుమలలో ఉన్న వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు సంపాదించారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక ఎరచ్రందనం అక్రమ రవాణా కూడా చేయించి డబ్బు సంపాదించారు. ఇక దందాలను తిరుపతిలో మొదలుపెట్టారు. తిరుపతిలో అల్లరి చిల్లరగా తిరిగే యువతకు మద్యం, డబ్బు ఆశ చూపి, వారిని ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడేశారు. ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే సెటిల్‌మెంట్ల కోసం ఓ ఆఫీస్‌ అన్నది మరో ఎత్తు అని చెప్పవచ్చు. బిజినెస్‌ మ్యాన్‌ సినిమా టైప్‌లో ఈ ఇద్దరు అన్నదమ్ములు బాగా డబ్బు సంపాదించే సరికి తిరుపతిలో సెటిల్మెంట్‌ కోసం ఏకంగా ఒక ఆఫీస్‌ తెరిచారు. అన్న ఉద్యోగానికి లాంగ్‌ లీవ్‌ పెట్టి భూ దందాల నుంచి అక్రమ వ్యాపారాల వరకు ఒక్కటీ కూడా వదిలేవాడు కాదు. తిరుపతిలో కొన్ని హత్యల వెనుక వీరి హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరికి పలుకుబడి తగ్గడం, ఉద్యోగానికి లాంగ్‌ లీవ్‌ పెట్టి దందాలు కొనసాగిస్తున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

 

చేసేది లేక అన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయాడు. టీడీపీ అండతో రెచ్చిపోతున్న అన్నదమ్ములు అన్నదమ్ములిద్దరూ టీడీపీలో చేరడం, చంద్రబాబుతో పరిచయాలు పెరగడంతో వీరి దందాలకు అడ్డు అదుపులేకుండాపోతోంది. రాజకీయ పలుకుబడితో గతం కంటే మరింత ఆగడాలకు తెరతీశారు. 2014 నుంచి 2019 వరకు ఆ అన్నదమ్ముల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఆ తరువాత వీరి ఆగడాలపై ఫిర్యాదులు వెల్లు వెత్తడంతో తమ్ముడి పై కేసు నమోదు చేసి రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. వీరితో పాటు ఉన్న అనుచరుల్లో చాలామందిపై రౌడీ షీట్‌లు ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్ల వద్ద ఉన్న అనుచరుల్లోని రౌడీషీటర్లను ఆటో, జీపు డ్రైవర్లుగా సెట్‌చేసి పెట్టుకుని ఉన్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో వీరిలో ఒక వ్యక్తి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు.ఎన్నికల్లో రూ.50 కోట్లు అయినా ఖర్చు పెట్టుకుంటానని లోకేష్‌కు చెప్పినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. లోకేష్‌ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడానికి కారణం కూడా అన్నదమ్ముల పైరవీలేనని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -