Prathyusha: ప్రత్యూష మరణంలో ఇన్ని కుట్రలు జరిగాయా?

Prathyusha: సినీ ఇండస్ట్రీలో నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు ఇప్పటికీ వీడని మిస్టరీ లాగే ఉండిపోయింది. చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడే కెరీర్ సెట్ చేసుకుంటున్నా సమయంలోనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం యావత్ సినీ ఇండస్ట్రీని కలవరపెట్టింది. ఈ ఘటనపై ఆమె తల్లి సరోజిని దేవి చాలా కాలంపాటు న్యాయం కోసం పోరాటం చేసింది. అయినా ఆమెకు ఎలాంటి న్యాయం దొరకలేదు. ఈ ఘటన జరిగి దాదాపు 20 సంవత్సరాలు గడుస్తోంది. ప్రత్యూష వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె నల్గొండ జిల్లా భువనగిరిలో జన్మించింది. ప్రత్యూషకు 17 సంవత్సరాల వయస్సులోనే నటిగా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి చొరవతో ఆమె ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డులను అందుకున్నారు. ప్రత్యూష తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలో నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంది.

 

అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన సినిమా ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రత్యూషను అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన ప్రత్యూషను సినిమా నుంచి తప్పించారు. ఇక ఉదయ్ కిరణ్ నటించిన ఓ సినిమాలో ఆయనకు మరదలు క్యారెక్టర్‌లో ప్రత్యూష నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఒకవేళ ప్రత్యూష మరణించకుంటే స్టార్ హీరోయిన్ అయి ఉండేది.

ఈ మధ్యకాలంలో ప్రత్యూష తల్లి సరోజిని దేవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె ప్రత్యూష ఆత్మహత్యపై సంచలన విషయాలను వెల్లడించింది. ప్రత్యూష చనిపోవడానికి ముందు తాను ప్రేమించిన అబ్బాయి సిద్దార్థ్ రెడ్డితో బయటకు వెళ్లిందని చెప్పినట్లు వెల్లడించారు. ఇక ఆ సమయంలో జయం సినిమాలో ఆమెను హీరోయిన్‌గా ఓకే చేశారని, జయం ఆఫీస్‌కు వెళ్లి వస్తానని చెప్పిందని ఆమె తల్లి చెప్పారు. అయితే అదే ఆమె చివరి మాటలు అవుతాయని అనుకోలేదని సరోజిని దేవి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు.. ప్రత్యూష పోస్టుమార్టు రిపోర్టు కూడా సిద్దార్ద్ తండ్రి మాయం చేశాడంటూ ఆరోపణలు చేసింది. తన కూతురి మరణానికి కారణమైన వారికీ తప్పకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిల నెత్తిన పాలు పోస్తున్న వైఎస్ జగన్.. ఎంత విమర్శలు చేస్తే అంత మేలా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పులివెందులలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో భాగంగా వైఎస్ వారసులు ఎవరో తేల్చుకోవాలంటూ...
- Advertisement -
- Advertisement -