Soumya Rao: సౌమ్యారావుతో అప్పుడే ఆ పని కూడా అయిపోయిందా?

Soumya Rao: తెలుగు టీవీ షోల్లో తిరుగులేని పాపులారిటీని సొంతం చేసుకున్న షో జబర్దస్త్. కామెడీ షోలను తెలుగు ప్రేక్షకులకు వేరే లెవల్ లో పరిచయం చేసిన జబర్దస్త్.. ఆ మధ్యన కాస్త హవా తగ్గినట్లు కనిపించింది. ఇప్పుడు పాత, పాపులర్ జబర్దస్త్ కమెడియన్లు అంతా రీఎంట్రీ ఇవ్వడం మరియు కొత్త యాంకర్ రావడంతో పూర్వ వైభవం వచ్చినట్లు కనిపిస్తోంది.

 

జబర్దస్త్ షోకి కన్నడ నటి సౌమ్యారావు యాంకరింగ్ చేస్తుండటం తెలిసిందే. కమెడియన్లకు పోటీగా అమ్మడు పంచులు వేస్తూ, తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఓ ఎపిసోడ్ లో సౌమ్యారావు తన గతం గురించి చెప్పి అందరికీ కన్నీళ్లు తెప్పించింది. జబర్దస్త్ చూసుకొని ఎప్పుడూ నవ్వుకునే జనాలు కూడా సౌమ్యారావు గతం విని బాధపడ్డారు.

 

ఆ తర్వాత జబర్దస్త్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉంటున్న ఓ కమెడియన్ యాంకర్ సౌమ్యారావుతో చనువుగా ఉంటున్నట్లు సమాచారం. ఎమోషనల్ ఎపిసోడ్ తర్వాత కమెడియన్ సౌమ్యారావు నెంబర్ తీసుకున్నాడని.. టాక్. ఇప్పుడు వీరిద్దరు ఎప్పుడు చూసినా చాటింగ్ చేసుకుంటున్నారని.. సెట్స్ లోనే కాదు బయట కూడా బిజీ అవుతున్నారని సమాచారం.

 

ఫోన్లలో చాటింగ్ చేసుకోవడంతో పాటు ఇద్దరు కలిసి డిన్నర్ పార్టీలు కూడా చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మధ్యన వీరిద్దరి వ్యవహారం శృతిమించిపోయిందని.. కమెడియన్ కారులోనే ఇద్దరూ స్కిట్ అయిపోయాక బయటకు వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చిన సౌమ్యారావు అప్పుడే ఇంత స్పీడుగా రెచ్చిపోతోందేంటా అని అందరూ అనుకుంటున్నారట.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -