Vinayaka Chavithi: వినాయకుడికి అవే నైవేథ్యాలు పెట్టాలంటా!

Vinayaka Chavithi: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. అందరి ఇంట్లో వారం రోజుల పాటు పూజలు పునస్కరాలు చేస్తుంటారు. చిన్నా పెద్ద తేడా లేకుండా తమ తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకుంటారు. ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం ఇది. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే వినాయక చవితి జరుపుకోవాలి. శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను బంగారం, వెండి, రాగి, మట్టితో ఏమీ లేకపోతే తమలపాకు మీద పసుపుతో వినాయకుడిని చేసి అర్చించాలి.

దూర్వాలు, బిల్వాలు(మారేడు) గణపతికి ప్రీతికరాలు కాబట్టి వాటితో అర్చించాలి. అవికాక శాస్త్రంలో చెప్పబడిన 21పత్రాలతో పూజించాలి. ఇవన్నీ ఔషధీయ విలువలున్న పత్రాలు. ప్రతి ఇళ్లు పూజించుకునే రోజు ఇది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ప్రతి ఇంటా యథావిధి గణపతిని పత్రాలతో పూజించి ఆయనకు ప్రీతికరంగా ఉండ్రాళ్లు, కుడుములు, వెలగ, అరటి, కొబ్బరి మొదలైన ఫలాలు నివేదించాలి. వినాయక చవితి రోజు తప్పకుండా దోసపండు నైవేథ్యం పెట్టాలి.

దోసపండు నైవేథ్యం పెట్టాలి. పండిపోయిన తర్వాత లోపల గింజలను తనంతట తాను విడిచిపెట్టేసేది.. ముచ్ఛిక నుంచి తానంతటతాను తేలికగ విడిపోయేది దోసపండు. దోసపండు ముచ్ఛికలోనుంచి విడివడినట్టు, దోసపండు లోని గింజలు దోసపండులోనే ముద్దగా పడిపోయినట్లు.. ఎంత త్వరగా జీర్ణం అవుతుందో అంత అజ్ఞానంలో నేను వున్నాను అని చెప్పటానికి.. నేను మోక్షాన్ని పొందటానికి మధ్యలో ఉ#న్నటువంటి ప్రతిబంధకాలు తనంతట తాను తొలగిపోయి నేను ఈశ్వర నాదంలోప్రయాణం చేసే స్థితిని పొందాలని ప్రార్థించటానికి అంత మాటను నువ్వు చెప్పలేవేమోనని దోసపండుని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించమన్నారు. పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్లు, కాయలు పాలవెల్లి నుండి వేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాధిదేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -