Sr Naresh: సీనియర్ నరేష్ రియల్ క్యారెక్టర్ బయటపెట్టిన పనిమనిషి లక్ష్మమ్మ!

Sr Naresh: సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇటీవల కన్నుమూశారు. తెలుగు ప్రేక్షకులకు పుట్టుడు దుఃఖం మిగిల్చి దివికేగారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఆయన శరీరంలో మల్టీ ఆర్గాన్స్‌ ఎఫెక్ట్‌ కావడం వల్లే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. తర్వాత మరుసటి రోజే తుదిశ్వాస విడిచారు. తాజాగా ఆయన అస్థికలను మహేష్‌బాబు, కుటుంబ సభ్యులు పవిత్ర నదుల్లో కలిపారు.

 

కృష్ణ ఇక లేరనే వార్త అభిమానులను కలచివేసింది. వేలాదిగా అభిమానులు పద్మాలయ స్టూడియోకు చేరుకుని తమ అభిమాన నటుడిని కడసారి చూసుకున్నారు. ఇక కృష్ణ, అలాగే విజయనిర్మల దంపతుల గొప్పతనం గురించి వారి దగ్గర పనిచేసిన తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో లక్ష్మమ్మ మాట్లాడారు. పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

 

కృష్ణ స్థాపించిన పద్మాలయా స్టూడియోలో 40 ఏళ్లుగా పనిచేశారు లక్ష్మమ్మ. కాలు విరగడంతో ప్రస్తుతం మూడేళ్ల నుంచి పనిచేయడం లేదని తెలిపింది. అంతకుముందు అక్కడే పనిచేశాని వివరించింది. కాలు విరిగి ఆస్పత్రిపాలైనప్పుడు కూడా మేనేజర్‌ను పంపించి సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆర్థిక సాయం చేశారని లక్ష్మమ్మ గుర్తు చేసుకుంది. ఇక తన కుమార్తె కృష్ణ తమ్ముడి ఇంట్లో వంట చేస్తుందని వెల్లడించింది. పెళ్లి, ఆమె పిల్లలు, చదువులు.. ఇలా అన్నీ కృష్ణ కుటుంబమే చూసుకుందని తెలిపింది. తన మనవళ్ల పెళ్లిళ్లకు కూడా కృష్ణ, విజయనిర్మల దంపతులు హాజరయ్యారని తెలిపింది.

 

ఆర్థికంగానూ తోడుగా నిలిచారు..
తమ పిల్లల పెళ్లిళ్ల సమయంలో కూడా తమకు ఆర్థికంగా చేయూతనందించారని గుర్తు చేసుకుంది లక్ష్మమ్మ. మరోవైపు విజయనిర్మల చనిపోయిన తరువాత సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇంటికి వెళ్లానని లక్ష్మమ్మ చెప్పింది. ఆ సమయంలోనే నరేష్.. అమ్మ చనిపోయిందని ఇక రావడం మానుకోవద్దు లక్ష్మమ్మ… అప్పుపడప్పుడు వస్తూ ఉండు.. అంటూ నరేష్‌ చెప్పాడని తెలిపింది. ఆయనది కూడా మంచి మనసు అని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -