Sreeja: చిరంజీవి చిన్న కూతురు ఇలాంటి వ్యక్తా.. దండం పెట్టాల్సిందే!

Sreeja: మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు ఓ ప్రభంజనం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని నెంబర్ వన్ హీరోగా ఎదిగిన తీరు ఆమోఘం. ఆయనే కాకుండా తన కుటుంబ సభ్యులు పవన్‌ కల్యాణ్‌,రామ్ చరణ్‌, అల్లు అర్జున్ కూడా సినీ రంగంలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం అనే ఓ బెంచ్ మార్క్ ను చిరంజీవి క్రియేట్ చేశాడు.

 

మెగా హీరోలందరూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా తమ పని తాము చేస్కుంటూ ఉంటారు. దీనితో తెలుగు సినీ రంగంలో మెగా ఫ్యామిలీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. ఇంతటి పేరు ఉన్న మెగా ఫ్యామిలీకి చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తలనొప్పిగా మారింది. గతంలో కూడా చిరంజీవి కూతురి గురించి వివాదాస్పద వార్తలు రావడం ఇప్పుడు మరోసారి శ్రీజ పేరు వార్తల్లోకెక్కడంతో ఈ చర్చ మొదలైంది.

 

మూడో పెళ్ళికి సిద్దమైన శ్రీజ?
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా.. మరోసారి కొత్త సంవత్సరంలో ముచ్చటగామూడో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో శ్రీజ మూడో పెళ్లి వార్త హాట్ టాపిక్కుగా మారింది. చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే ఓ వ్యక్తిని ప్రేమించి, ఇంట్లో వాళ్లను ఎదురించి అతడిని పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. వాళ్లు విడిపోయారు. మెగాస్టార్ చిరంజీవి తన కూతురిని ఇంటికి తెచ్చుకోగా.. కొన్ని సంవత్సరాల తర్వాత కళ్యాణ్ దేవ్ తో రెండో పెళ్లిని చిరంజీవి దంపతులు కుదిర్చారు.

 

ఇప్పుడు అతనితో కూడా దూరంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ముచ్చటగా మూడో పెళ్ళికి రెడీ అయినట్టు ఫిలింనగర్ కోడై కూస్తుంది. దీనితో మెగా ఫ్యాన్స్ చిరంజీవి పరువు తీయద్దు అంటూ శ్రీజకు దండం పెడుతున్నారు. అయితే తనలో తానే కొత్త వ్యక్తిని కనుక్కున్నానని, తనతో తానే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ చదివిన ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -