Sri Chaithanya: స్టూడెంట్‌ను ఎగిరెగిరి తన్నిన లేక్చరర్‌.. అసలు కారణం ఇదే!

రోజురోజుకు కార్పొరేట్‌ విద్యా సంస్థల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులపై విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా కొడుతున్నారు. గతంలో ఉపాధ్యాయులు వేధింపులకు భరించక ఎక్కువ మంది కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కార్పొరేట్‌ కళాశాలలపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి తీరు మారడం లేదు. తాజాగా ఓ కళాశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థిని చితక్కొట్టాడు.

తాజాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఒక లెక్చరర్‌.. విద్యార్థిని తరగతి గదిలోనే విచక్షణా రహితంగా కొట్టాడు. ఎగిరెగిరి కాలితో తన్నుతున్న దృశ్యాలను వెనుక బెంచీలో కూర్చున్న విద్యార్థులు రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. విజయవాడ బెంచ్‌ సర్కిల్‌ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఈ ఘటన జరిగింది. వీడియో వైరల్‌ కావడంతో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు క్యాంపస్‌కు వెళ్లి విచారణ జరిపారు. ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకా కాలేజీకి వెళ్లి జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు.

ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విద్యార్థి ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని తరగతి గదిలో పాటలు వింటుంటే ఆవేశంతో కొట్టిన మాట వాస్తవమేనని లెక్చరర్‌ అంగీకరించారు. అయితే విద్యార్థి మాత్రం తన దగ్గర అసలు ఇయర్‌ఫోనే లేదని చెప్పుకొచ్చాడు. విద్యార్థిని కొట్టిన లెక్చరర్‌ను విధుల నుంచి తొలగించినట్లు యాజమాన్యం ఉన్నతాధికారులకు తెలిపింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఒకొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. విద్యార్థులను అలా కొట్టడం సరికాదని.. కొందరు కామెంట్లు పెట్టగా.. విద్యార్థి తప్పుచేస్తేనే ఉపాధ్యాయులు సహనం కోల్పోయి ఇలా ప్రవర్తిస్తారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -