Viral Video: అలుగుతున్న టీచర్‌కు ముద్దులు పెట్టిన చిన్నారి.. ఎందుకంటే!

Viral Video: తరగతి గదుల్లో చిన్నారులు అల్లరి చేస్తే కొందరు టీచర్లు గట్టిగా మందలిస్తారు.. మరి కొందరు భయపెడుతారు.. ఇంకొందరు ప్రేమ,ఆప్యాయతతో క్రమశిక్షణ నేర్పిస్తారు. కొందరు చిన్నారులు చేసే అల్లరి, చిలిపి పనులు ముద్దుగా, నవ్వించేలా ఉంటాయి. చిన్నారులు, కలిగిన టీచర్లు కూడా వారిలాగే ప్రవర్తిస్తూ వారిని నవ్విస్తుంటారు.తాజాగా ఓ బుడ్డుడోపై ఓ టీచర్‌ అలగినట్లు ప్రవర్తించిన వీడియో చాలా వైరల్‌ అవుతోంది. తరగతి గదిలో చిన్నపిల్లలు చేసే అల్లరి చేష్టలు ఎంతో ముద్దు ముద్దుగా ఉంటాయి. అలాంటివారిని టీచర్లు కూడా ఆటపట్టిస్తుంటారు. ఆ బుడ్డాడిని అడిగి మరీ తన బుగ్గపై ముద్దులు పెట్టించుకుంది.

అసలు ఆ బుడ్డోడు ఏం చేశాడో తెలియదు గానీ.. ఆ చిన్నారిని పిలిచిన ఆ అందమైన టీచరమ్మ పలు ప్రశ్నలు అడగ్గా, వాడు సారీ టీచర్‌ క్షమించు అంటూ ప్రాధేయపడతాడు. ఆ టీచర్‌ మాత్రం బొంగమూతి పెట్టుకుని అలుగుతూ ఉంటుంది. ఆ చిన్నారి మాత్రం సారీ టీచర్‌ మరోసారి చేయను టీచర్‌ అంటుంటాడు.

అయినా ఆమె నువ్వు అలాగే చేస్తావు.. నేను నీతో మాట్లాడను పో.. అంటుంది.. మళ్లీ ఆ బుడ్డుడి సారీ.. టీచర్‌ సారీ టీచర్‌ అంటూ ఆమె బుగ్గలపై ముద్దులు పెడతాడు. ఈ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే, ఉత్తర భారతదేశంలోని ఓ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తనదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aaj Tak (@aajtak)

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -