Sai Dharam Tej: వివాదంలో శ్రీకాళహస్తి అధికారులు.. ఏకంగా అలాంటి తప్పు చేయడంతో?

Sai Dharam Tej: శ్రీకాళహస్తి ఆలయంలో మరో తప్పిదం జరిగింది. సింగర్ మంగ్లీ కి ఆలయంలో షూటింగ్ చేసుకోవటానికి అనుమతులు ఇచ్చిన గొడవ ఇంకా సర్దుమణగక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. శ్రీకాళహస్తి అర్చకులు సెలబ్రిటీలు వచ్చినప్పుడు అతి చేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు సామాన్య భక్తులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బ్రో సినిమా నుంచి రెండో సాంగ్ ని తిరుపతిలో ఒక థియేటర్లో ఈరోజు విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ తిరుపతి చేరుకొని చుట్టుపక్కల ఆలయాలన్నీ సందర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయానికి కూడా వెళ్ళాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత ఇది నాకు పునర్జన్మ అని అందుకే తాను ఆలయాలని సందర్శిస్తున్నట్లు మెగా మేనల్లుడు. కాళహస్తి ముక్కంటి ఆలయంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి స్వయంగా అతని చేతులతో హారతి ఇచ్చాడు.

 

ఆలయ పూజారులే హారతి ఇవ్వాల్సి ఉంది కానీ వారే సాయిధరమ్ తేజ హారతి ఇప్పించారు. ఇదంతా ఆలయ చైర్మన్ ఇతర ఆలయ అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరగటంతో సాయిధరమ్ తేజ్ తో పాటు ఆలయ అధికారులపై కూడా విమర్శలు వినబడుతున్నాయి. స్వామివారికి హారతి అర్చకులు తప్పితే సామాన్య మానవులకి ఆ అర్హత లేదు అని చెప్తున్నారు పండితులు. ఇందులో సాయి ధరంతేజ్ తప్పు ఏమీ లేదు ఎందుకంటే అతనికి ఆచార వ్యవహారాల సంగతి అంతగా తెలిసి ఉండకపోవచ్చు.

 

కానీ అక్కడ ఉన్న అర్చకులకి ఏమైంది.. అయినా ఎవరైనా సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఆలయ అర్చకులు అతి చేయటం అనేది ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. మొన్న సింగర్ మంగ్లీ కి షూటింగ్ పర్మిషన్లు ఇచ్చి వ్యవహార ఆచార వ్యవహారాలని తుంగలో తొక్కారు. మళ్లీ ఇప్పుడు అదే తప్పు చేశారు. ఆచారాలని సాంప్రదాయాలని చేజేతులా మంట కలుపుతున్నారు అంటూ మండిపడుతున్నారు సాధారణ భక్తులు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో కాలమే నిర్ణయించాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -